కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ కోసం.. ప‌డిగాపులు...!

దీనిని త‌ర్వాత‌..వ‌చ్చిన వైసీపీ స‌ర్కారు కూడా కొన‌సా గించింది. ఈ కార్పొరేష‌న్‌లో కీల‌క‌మైన చైర్మ‌న్ ప‌ద‌వి కోసం.. ఇప్పుడు నాయకులు పోటీప‌డుతున్నారు

Update: 2024-08-19 07:30 GMT

రాష్ట్రంలో రిజ‌ర్వేష‌న్లు డిమాండ్ చేస్తున్న కాపు సామాజిక వ‌ర్గం కోసం.. వారికి మేలు చేయ‌డం కోసం 2014-19 మ‌ధ్య కాలంలో చంద్ర‌బాబు స‌ర్కారు కాపు కార్పొరేష‌న్‌ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీని ద్వారా కాపుల‌కు ఆర్థిక సాయం, రుణాలు, ఇత‌ర‌త్రా సాయాలు, అదేవిధంగానైపుణ్య శిక్ష‌ణ‌, ఇత‌ర ఉద్యోగా ల‌కు సంబంధించిన శిక్ష‌ణ కూడా అందించేవారు. దీనిని త‌ర్వాత‌..వ‌చ్చిన వైసీపీ స‌ర్కారు కూడా కొన‌సా గించింది. ఈ కార్పొరేష‌న్‌లో కీల‌క‌మైన చైర్మ‌న్ ప‌ద‌వి కోసం.. ఇప్పుడు నాయకులు పోటీప‌డుతున్నారు.

కూట‌మి స‌ర్కారు వ‌చ్చి రెండు మాసాలు పూర్త‌యిన నేప‌థ్యంలో నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసేందు కు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కోనసీమకు చెందిన‌ ఆకుల రామకృష్ణ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. కుటమి ప్రభుత్వం కొలువుతీరి రెండు నెలలు పూర్తి కావడంతో నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న వారు త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఎవరికి వారు తమకున్న పరిచయాలతో పార్టీ అగ్ర నేతలను ప్రసన్న చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో కాపుల ప్రభావం అత్యధికంగా ఉండటంతో ఈసారి కాపు కార్పొరేషన్ చైర్మన్ ప‌ద‌వి హాట్ హాట్‌గా మారింది. కోస్తా జిల్లాలకు చెందిన నాయ‌కుడికి ఇవ్వాల‌ని కొంద‌రు భావిస్తున్నారు. కానీ, ఉత్త‌రాంధ్ర‌కు స్పీక‌ర్‌, 2 మంత్రి ప‌ద‌వుల‌నే ఇచ్చిన నేప‌థ్యంలో కాపు కార్పొరేష‌న్ ప‌ద‌విని ఇవ్వాల‌ని ఇక్క‌డ నాయకులు కోరుతున్నారు. దీనిపై ఇప్ప‌టికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ప్రత్యేకం గా దృష్టి సారించిన‌ట్టు తెలిసింది.

కాపు కార్పొరేషన్ చైర్మన్ గా సమర్థత కలిగిన వ్యక్తిని ఎంపిక చేసి, తద్వారా ఆ వర్గాలను సంతృప్తి పరచడంతో పాటు వివిధ రకాల సంక్షేమ సేవా కార్యక్రమాలు అమలు జరపటం ద్వారా కాపు సామా జిక వర్గీయులు ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెంపొందించుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

వీరిలో ఆకుల రామకృష్ణ పేరు తొలి వ‌రుస‌లో ఉంద‌ని తెలిసింది. ఈయ‌న మాజీ స్పీకర్ బాలయోగికి ముఖ్య అనుచ‌రుడిగా పేరున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆకుల‌కు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌, రాష్ట్ర మంత్రి సుభాష్, రెడ్డి సుబ్రమణ్యం, యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రు, నిమ్మకాయల చినరాజప్పలు ఆశీస్సులు మెండుగా ఉండటంతో ఆయ‌న‌ను దాదాపు ఎంపిక చేయొచ్చ‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News