అక్కడ కుమారస్వామికి అగ్నిపరీక్షే !

ఈ నేపథ్యంలో కుమారస్వామి విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి సివిల్‌ కాంట్రాక్టర్‌ వెంకటరమణి గౌడ అలియాస్‌ స్టార్‌ చంద్రుతో పోటీ చేస్తున్నారు.

Update: 2024-04-22 09:30 GMT

కర్ణాటకలోని మండ్య నుంచి లోక్‌సభ స్థానం నుండి బరిలో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామికి ఈసారి అక్కడి ఎన్నిక అగ్ని పరీక్షగానే మిగిలింది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్క సారి మినహా 13 సార్లు అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కుమారస్వామి విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి సివిల్‌ కాంట్రాక్టర్‌ వెంకటరమణి గౌడ అలియాస్‌ స్టార్‌ చంద్రుతో పోటీ చేస్తున్నారు. స్థానికుడు అయిన ఆయనకు ఇక్కడి ప్రజలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. దాదాపు రూ.254 కోట్ల ఆస్తులు ఉన్న ఆయన అర్ధబలంలోనూ గట్టిగానే ఉన్నారు. నేను మాండ్య పుత్రుడను అని ఆయన ప్రచారం చేస్తున్నాడు.

2019 ఎన్నికల్లో మండ్య నుంచి నటి సుమలత అంబరీష్‌ బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఈసారి ఎన్నికలకు ఆమె దూరంగా ఉంటుండగా, జేడీఎస్, బీజేపీ పొత్తులో భాగంగా కుమారస్వామి బరిలోకి దిగాడు.

8 శాసనసభ స్థానాలు ఉన్న ఈ లోక్ సభ పరిధిలో 50 శాతం మంది ఓటర్లు ఒక్కలిగలే కావడం విశేషం. 8 స్థానాలకు గాను గత ఎన్నికలలో కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. ఇక్కడ ఒక్కలిగల ఓట్లే విజేతను నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 26న జరగనున్న ఎన్నికలలో కుమారస్వామిని ఎంత వరకు ఆదరిస్తారు అన్న ఉత్కంఠ నెలకొన్నది.

Tags:    

Similar News