యూఎస్ లో భారతీయుడు కాల్పుల్లో భారత మహిళ మృతి!
ఈ క్రమంలోనే తాజాగా యూఎస్ లో ఒక భారతీయ యువకుడు.. ఇద్దరు భారతీయ మహిళలపై తుపాకీతో కాల్చిన ఘటన జరిగింది.
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కల్చర్ తోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికా అంతటా ఇది భయంకరమైన వాస్తవంగా మారిన పరిస్థితి. ఫలితంగా.. అనూహ్యంగా జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా యూఎస్ లో ఒక భారతీయ యువకుడు.. ఇద్దరు భారతీయ మహిళలపై తుపాకీతో కాల్చిన ఘటన జరిగింది.
అవును... ఇటీవల న్యూజెర్సీ లోని రూజ్ వెల్ట్ అవెన్యూలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన అప్ డేట్ ను న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ వెల్లడించింది. ఇందులో భాగంగా... ఆ కాల్పుల్లో జస్వీర్ కౌర్ మరణించగా.. గగన్ దీప్ కౌర్ కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
వివరాళ్లోకి వెళ్తే... న్యూజెర్సీలోని ఇద్దరు భారతీయ మహిళలపై, భారత సంతతికి చెందిన యువకుడు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో జస్వీర్ కౌర్ మరణించగా.. గగన్ దీప్ కౌర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి విషయంగా ఉందని తెలుస్తుంది. బుధవారం ఉదయం రూజ్ వెల్ట్ అవెన్యూలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు.
ఈ సమయంలో వీరిపై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19ఏళ్ల గౌరవ్ గిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తాజా పురోగతిగా చెప్పుకోవచ్చు. కాల్పుల ఘటన అనంతరం పోస్ట్ బౌలెవార్డ్ లో చుట్టు కంచెతో ఉన్న యార్డ్ లో గౌరవ ను కనుగొన్నట్లు చెబుతున్నారు.
ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. ఈ విషయంలో గౌరవ్ ను గుర్తించడంలో స్థానిక నివాసి లారా లార్టన్ సహకరించినట్లు చెబుతున్నారు. మరోపక్క ఉదయం 9 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగిన అనంతరం బాధితులిద్దరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ సమయంలో చికిత్స పొందుతూ జస్వీర్ కౌర్ మరణించారు.