అన్నదమ్ముల పోరు.. పోలింగ్ ఏ తీరు?
అన్నదమ్ముల పోరు ఓ రేంజ్‌లో సాగుతున్న నియోజకవర్గం విజయవాడ పార్లమెంటు.
అన్నదమ్ముల పోరు ఓ రేంజ్‌లో సాగుతున్న నియోజకవర్గం విజయవాడ పార్లమెంటు. ఇక్కడ కేశినేని నాని, కేశినేని చిన్ని.. ఇద్దరూ ఒక తల్లి బిడ్డలే. నిన్న మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్నారు. కానీ, ఎన్ని కలకు కొద్ది రోజుల ముందు మాత్రమే.. కేశినేని నాని పార్టీ మారి వైసీపీ కండువా కప్పుకొని టికెట్ సొంతం చేసుకున్నారు. ఇతర నియోజకవర్గాల మాదిరిగా.. ఇక్కడ సాధారణ ఫైట్ ఉందని అనుకుంటే పొరపాటే. ఇక్కడ భిన్నంగా ముందుకు సాగుతున్నారు.
సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయినా.. అభివృద్ధి, ప్రత్యర్థి లోటుపాట్లు.. వంటివిచర్చకు వస్తాయి. కానీ, ఇక్కడ మాత్రం.. అవినీతి, అక్రమాలు, మాఫియా వంటివి చర్చకు వస్తున్నాయి. తనపై కేసులు పెట్టించి.. తన భార్యను తనను వేధించాడని.. అన్న నానీపై చిన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇవే విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇక, నాని కూడా.. ఇదే తరహా ప్రచారం చేస్తున్నారు. చిన్నీని దొంగ అంటూ.. ఆయన ప్రచారంలో బాహాటంగానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఒకప్పుడు చాలా ప్రశాంతంగా హుందాగా ఉన్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు, కేసులు, విమర్శలతోనే అన్నదమ్ములు కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా నాని సెల్ఫీ ఆడియో ఒకటి విడుదల చేశారు. ప్రజలను ఓటేయాలని కోరారు. దీనిని కార్నర్ చేస్తూ.. చిన్ని.. చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టించాయి. నానీని దొంగ అంటూ.. ఆయన రివర్స్ ఎటాక్ చేశారు. ఎంపీగా ఉండి..లంచాలు తీసుకున్నాడని.. నిధులు దాచేశాడని. వ్యాఖ్యానించారు. మొత్తంగా.. అన్నదమ్ముల పోరు తో పోలింగ్ ఎటు వైపు ఎలా పోతుందో అనే చర్చ సాగుతుండడం గమనార్హం.