బెజ‌వాడ అన్న‌ద‌మ్ముల స‌వాళ్ల వెన‌క ఇన్ని ట్విస్టులా...!

ఇది మిన‌హా .. ఇంకెవ‌రూ.. ఇలా పోటీ చేయ‌లేదు. అయితే.. ఇప్పుడు మారిన ప‌రిస్థితుల నేప‌థ్య‌లో విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం నుంచి కేశినేని బ్ర‌ద‌ర్స్ త‌ల‌ప‌డ‌నున్నారు.

Update: 2024-01-11 10:48 GMT

ఏపీలో స‌రికొత్త చ‌రిత్ర‌కు పునాది ప‌డ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు .. చాలా మంది పోటీ చేసినా.. ఒక త‌ల్లి క‌డుపున పుట్టిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ప్ర‌త్య‌ర్థులుగా మారి ఒకే సీటు నుంచి పోటీ చేసిన ప‌రిస్థితి లేదు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో అర‌కు పార్ల‌మెంటు స్థానం నుంచి కిశోర్ చంద్ర‌దేవ్‌.. ఆయ‌న కుమార్తె వైచ‌ర్ల శృతి దేవి త‌ల‌ప‌డ్డారు. కిశోర్ చంద్ర‌దేవ్ టీడీపీ నుంచి ఆయ‌న కుమార్తె కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.

ఇది మిన‌హా .. ఇంకెవ‌రూ.. ఇలా పోటీ చేయ‌లేదు. అయితే.. ఇప్పుడు మారిన ప‌రిస్థితుల నేప‌థ్య‌లో విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం నుంచి కేశినేని బ్ర‌ద‌ర్స్ త‌ల‌ప‌డ‌నున్నారు. వైసీపీ నుంచి నాని, టీడీపీ నుంచికేశినేని శివ‌నాథ్ ఉర‌ఫ్ చిన్ని.. పోటీకి రెడీ అయ్యారు.అ ధికారిక ప్ర‌క‌ట‌న‌లు మాత్ర‌మే రావాల్సి ఉంది. ఇప్ప‌టికే నాని త‌న‌ప‌ద‌వికి.. పార్టీకి కూడా రాజీనామా చేశారు. దీంతో ఇద్ద‌రి పోటీపై ఆస‌క్తి నెల‌కొంది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు అన్న‌ద‌మ్ములు పోటాపోటీగా ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన హిస్ట‌రీ లేదు.

పైగా అత్యంత‌కీల‌క‌మైన విజ‌య‌వాడ పార్ల‌మెంటు సెగ్మెంట్‌లో సిట్టింగ్ ఎంపీ నాని.. ఆయ‌న తోడ‌బుట్టిన చిన్నిలు పోటీ ప‌డుతుండ‌డం.. రాజ‌కీయంగా ఆస‌క్తిని పెంచేసింది. వీరి లో ఎవ‌రు గెలుస్తారు? అనేది ఒక చ‌ర్చ అయితే.. మ‌రోవైపు.. ఒకే కుటుంబంలోని నాయ‌కులు రేపు ప్ర‌చారానికి వెళ్తే.. ఏమ‌ని ఓట్లు వేయాల‌ని అడుగుతారు? ప‌ర‌స్ప‌రం ఏం విమ‌ర్శ‌లు చేసుకుంటారు? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. విష‌యం ఏదైనా.. కూడా ఇలా అన్న‌ద‌మ్ములు స‌వాల్ చేసుకోవ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

గెలుపు విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త టాటా సంస్థ‌ల నుంచి తీసుకువ‌చ్చిన నిధుల‌తో కేశినేని నాని.. జిల్లాలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేసిన మాట వాస్త‌వం. ఇది ఎంత వ‌ర‌కు ఆయ‌న‌ను గెలిపిస్తుందోచూడాలి. ఇక‌, పార్టీపై ప‌ట్టు పెంచుకున్న చిన్న కూడా జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పార్ల‌మెంటు సెగ్మెంటులో బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌న‌కు కూడా అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఇలా.. ఏవిధంగా చూసుకున్నా అన్న‌ద‌మ్ముల పోరు.. తార‌స్థాయిలోనే ఉండ‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎవ‌రు గెలిచినా.. విజ‌య‌వాడ రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేక హిస్ట‌రీని క్రియేట్ చేయ‌నున్నార‌నేది వాస్త‌వం.

Tags:    

Similar News