గుడిలో చెంపలు వాయించిన భక్తుడు.. ట్విస్ట్ ఇచ్చిన టెర్రరిస్టు!

ఈ హడావిడిలో ఆలయంలోకి ఉగ్రవాదులు వచ్చారు అంటూ ఎవరో పోలీసు కంట్రోల్ రూమ్‌ కు సమాచారం వచ్చింది.

Update: 2023-08-09 08:36 GMT

ప్రశాంతంగా కాసేపు దైవ దర్శనం చేసుకుని వద్దామనుకుని గుడికి వెళ్తే.. ఆ సమయంలో ముసుగులు ధరించి, చేతిలో తుపాకులతో ఎవరైనా కనిపిస్తే పరిస్థితి ఏమిటి? వారు ఉగ్రవాదులని సూచాయిగా తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది ఒక దేవాలయంలో!

అవును... ఉగ్రవాదులు చేతులో ఏకే 47 తుపాకులు పట్టుకుని, ముసుగులు వేసుకుని, మరో వ్యక్తి తలకు గన్ గురిపెట్టి ఉంటే.. చూసేవారి పరిస్థితి ఏమిటి? మిగిలిన వారి సంగతి తెలియదు కానీ.. ఆ సమయంలో ఆ గుడిలో ఉన్న ఒక వ్యక్తి మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. తన తెగువ ఏమిటో చూపించాడు.

అలా ఒక వ్యక్తిని మోకళ్లపై కూర్చోబెట్టి తలకు తుపాకీ గురిపెట్టిన ఉగ్రావాదులపైకి ఆ వ్యక్తి ఫోర్స్ గా వెళ్లాడు. అనంతరం ఆ ఉగ్రవాది రెండు చెంపలూ బలంగా వాయించాడు. ఈ హడావిడిలో ఆలయంలోకి ఉగ్రవాదులు వచ్చారు అంటూ ఎవరో పోలీసు కంట్రోల్ రూమ్‌ కు సమాచారం వచ్చింది.

దీంతో పోలీసులు ఆఘమేఘాలమీద ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు నేరుగా, ధైర్యంగా ఆలయంలోకి వచ్చి దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఏంటీ ఇదేమన్నా సినిమా కథా అనుకోవద్దు. నిజంగానే పోలీసులు హుటాహుటిన అక్కడకు వచ్చి ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.

ట్విస్ట్ ఇదే: ఇక్కడ జరిగిన సంఘటనలో ట్విస్ట్ ఏంటంటే... ఆ ఉగ్రవాది ఫేక్, కానీ భక్తుడు మాత్రం రియల్. అవును... ఇది పోలీసులు నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ లో భాగం. ఈ విషయం తెలియడంతో తుపాకీ శబ్దాలకు వణిపోయిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇక టెర్రరిస్టుపైకి దూసుకెళ్లిన ఆ వ్యక్తి పేరు ప్రశాంత్‌ కులకర్ణి అని వెల్లడించారు అధికారులు. ఈ విషయాలపై స్పందించిన కులకర్ణి... తన కుమార్తె ఏడ్వడం వల్లే ఆయన అంత ధైర్యం చేసానని చెబుతున్నాడు. ఏది ఏమైనా అది పోలీసుల మాక్ డ్రిల్ అని తెలియని ఆ వ్యక్తి.. కూతురు ఏడ్చిందని ఉగ్రవాదులపైకి ధైర్యంగా వెళ్లటం అభినందించాల్సిందే!

Full View
Tags:    

Similar News