సంచలన రిపోర్టు: డ్రాయింగ్ ప్రకారం 7బ్లాక్ నిర్మాణం లేదు!

తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కీలక రిపోర్టును సిద్దం చేసింది

Update: 2024-02-15 04:24 GMT

తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కీలక రిపోర్టును సిద్దం చేసింది. విపక్ష బీఆర్ఎస్ మరింత ఇరుకున పడేలా ఇందులోని అంశాలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం మొదలుకొని నిర్వాహణ వరకు అంతా లోపాలమయంగా తాజా రిపోర్టు స్పష్టం చేసింది. కాంట్రాక్టు సంస్థతో పాటు నీటిపారుదల శాఖ అనేక అంశాల్లో ఒప్పందాల్లోని అంశాల్ని పట్టించుకోలేదని పేర్కొంది. వివరంగా దర్యాప్తు నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే..

- మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ నిర్మాణం ప్లాన్ ప్రకారం లేదు. డ్రాయింగ్ ప్రకారం రాఫ్ట్.. సీకెంట్ ఫైల్స్ నిర్మాణం లేదు. నష్టానికి ఇది ప్రధాన కారణం.

- 16 నుంచి 21 వరకు పియర్స్ పగుళ్లు..రాఫ్ట్ వైఫల్యాలకు సపోర్టింగ్ మెటీరియల్ కోల్పోవటం కారణం కావొచ్చు. దీన్ని నిర్మాణం చేసిన ఎల్ అండ్ టీ కారణం.

- 2019 జూన్ లో బ్యారేజ్ ప్రారంభమైనప్పటి నుంచి మొయింటెన్స్ జరగలేదు. 2019లోనే సీసీ బ్లాకులు పక్కకు వెళ్లిపోయాయి. ప్లింత్ శ్లాబ్ పారామెట్రిక్ జాయింట్ ను గుర్తించినా పట్టించుకోకపోవటంతో సమస్య తీవ్రమైంది. దీనికి నిర్మాణ సంస్థ.. నీటిపారుదల శాఖలే కారణం.

- దెబ్బ తిన్న పనులు బాగు చేయాలని పలుమార్లు నీటిపారుదల శాఖ లేఖలు రాసినా పట్టించుకోలేదు. ఒప్పందానికి భిన్నంగా పని పూర్తి అయినట్లు ఇంజినీర్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత కూడా కాఫర్ డ్యాం.. షీట్ పైల్స్ ను తొలగించలేదు.

- ఐదు సీజన్లలో కూడా వీటిని తొలగించలేదు. నది ప్రవాహాన్ని దెబ్బ తీసింది. ఒప్పందం ప్రకారం బ్యారేజీ అప్పగింతకు సంబంధించిన పని జరగలేదు.

- డ్యాం సేఫ్టీ యాక్టు ప్రకారం వర్షాకాలానికి ముందు తర్వాత బ్యారేజీని తనిఖీ చేయాలి. కానీ.. అలాంటి తనిఖీ జరగలేదు.

- పనులు పెండింగ్ లో ఉన్నా బ్యాంక్ గ్యారెంటీలను విడుదల చేశారు. దీనికి నీటిపారుదల శాఖే కారణం. బ్యారేజీలో మేజర్ బ్లాకులు సబ్ కాంట్రాక్టర్లు నిర్మించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ జరుపుతున్నాం.

Tags:    

Similar News