మీర్ పేట్ మాధవి హత్య కేసు... తెరపైకి మరో సంచలనం!
మీర్ పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... మాధవిని హత్యచేసింది గురుమూర్తి ఒక్కడే కాదనే సందేహాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
మీర్ పేట్ లో మాధవి అనే మహిళను ఆమె భర్త ఎంత దారుణాతిదారుణంగా హత్య చేశాడనే సంగతి తెలిసిందే. ఆమెను ఇంట్లో చంపి, మాంసాన్ని ఉడికించి ముద్దగా చేసి, ఎముకలను పొడిగా చేసి చెరువులో పాడేసిన పరిస్థితి. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో ఈ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది.
అవును... మీర్ పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... మాధవిని హత్యచేసింది గురుమూర్తి ఒక్కడే కాదనే సందేహాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు గురుమూర్తితో పాటు మరో ముగ్గురు కలిసి మాధవిని హత్యచేసి ఉంటారనే అనుమానాలున్నాయని అంటున్నారు.
పైగా.. ఆ మిగతా ముగ్గురిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. మాధవి హత్య విషయంలో గురుమూర్తికి సహకరించిన వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అవసరమైతే.. గురుమూర్తికి పాలీగ్రాఫ్ పరీక్షలు కూడా నిర్వహించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రిమాండ్ చేసి జైలుకు తరలించిన పోలీసులు.. శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు సరూర్ నగర్ లోని సీసీఎస్ లేదా అబ్దుల్లాపూర్ మెట్ స్టేషన్ కు విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12 వరకూ గురుమూర్తిని విచార్ణ చేయనున్నట్లు చెబుతున్నారు.
కాగా.. ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తి మీర్ పేట్ లో నివాసం ఉంటూ తన భార్య వెంకటమాధవిని హత్యచేసి ఆనవళ్లు తెలియకుండా చేయడానికి ఓ వెబ్ సిరీస్ ని ఫాలో అయ్యి.. ఇందులో భాగంగా భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వేడి నీటిలో ఉడికించి, ఎముకలను పొడిగా ఏసి చెరువులో పాడేసిన వ్యవహరం తెలిసిందే!