మంత్రులు రోజా అంబటి సీట్లు గల్లంతేనా...!?

వైసీపీ మంత్రులలో కొందరికి ఈసారి టికెట్లు దక్కవని ముందు నుంచి ప్రచారం ఉంది. అనుకున్నట్లుగానే గుమ్మలూరి జయరాం కి టికెట్ ఇవ్వలేదు.

Update: 2024-03-14 03:31 GMT

వైసీపీ మంత్రులలో కొందరికి ఈసారి టికెట్లు దక్కవని ముందు నుంచి ప్రచారం ఉంది. అనుకున్నట్లుగానే గుమ్మలూరి జయరాం కి టికెట్ ఇవ్వలేదు. ఆయన పోయి టీడీపీలో కలిశారు. అక్కడ గుంతకల్లు టికెట్ ఆయన పట్టేశారు. ఇక చివరాఖరుకు కధ వచ్చింది.

కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. వైసీపీ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయి రిలీజ్ కావడానికి. వన్స్ లిస్ట్ బయటకు వస్తే మార్పు చేర్పులకు బహు తక్కువ అవకాశాలే అని అంటున్నారు. సో ఆ లిస్ట్ తోనే అభ్యర్ధులు జనాల్లోకి పోవాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే ఇంతకాలం తమ సీట్లు ఖాయం అని అనుకుంటున్న ఇద్దరు మంత్రులను జగన్ పిలిపించి మాట్లాడడం సంచలనం రేపుతోంది. వారే నగరి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే రోజా. అలాగే సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబు. మంత్రులలో ఈ ఇద్దరూ తీవ్రమైన వ్యతిరేకతను నియోజకవర్గాలలో ఎదుర్కొంటున్నారు.

అంతే కాదు వారికి సీటు ఇస్తే ఓటమి ఖాయమని సొంత పార్టీ వారే చెప్పేస్తున్నారు. నగరి లో అయితే రోజాని గెలవనీయమని సొంత పార్టీకి చెందిన అయిదు మండలాల నాయకులు ప్రతిజ్ఞ పట్టారు. సత్తేనపల్లిలో సేం సీన్ ఉంది. దాంతో జగన్ ఒకేసారి అసమ్మతి నేతలను మంత్రులను ఎదురు పెట్టి మరీ మాట్లాడారు అని అంటున్నారు.

ఈసారికి వీరికే టికెట్లు ఇస్తే పనిచేస్తారా అని జగన్ వారిని అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. మరి వారు ససేమిరా అంటే మాత్రం అక్కడ కొత్త ముఖానికే చాన్స్ అని అంటున్నారు. ఇక సత్తెనపల్లి విషయంలో చూసుకుంటే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు టికెట్ ఇచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారుట.

అంబటికి పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా ఇస్తారని అంటున్నారు. ఇక రోజా విషయానికి వస్తే ఆమె సీటులో బీసీ అభ్యర్థికి చాన్స్ ఉండవచ్చు. లేదా రెడ్డివారి చక్రపాణిరెడ్డికి అయినా టికెట్ ఇవ్వవచ్చు అని అంటున్నారు. రెడ్డివారి చక్రపాణిరెడ్డి శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా పనిచేస్తున్నారు.

ఆయన అభ్యర్ధిత్వం అంటే నగరి మొత్తం ఐక్యంగా వైసీపీలో పనిచేస్తుందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ ఇద్దరి సీట్లూ చిరిగిపోవడం ఖాయమని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. నగరి అసమ్మతి మీద రోజా మీడియాతో ఒక రోజు ముందే మాట్లాడారు. అసమంతి వర్గీయులు పార్టీని వీడిపోతే తాను ఏకంగా ముప్పయి నుంచి నలభై వేల ఓట్ల తేడాతో గెలుస్తాను అని ఆమె సంచలన కామెంట్స్ చేసారు.

కానీ వైసీపీ అధినాయకత్వానికి ఎప్పటికపుడు గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తెలుసు కాబట్టి మంత్రులతో స్మూత్ గానే డీల్ చేస్తున్నారు అని అంటున్నారు. అంబటి రోజాలు ఒప్పుకుని పోటీ నుంచి తప్పుకుంటే వారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి స్టార్ కాంపెనియర్లు అవుతారు అని అంటున్నారు.

Tags:    

Similar News