మోడీకి సెగ.. రంగంలోకి ఆర్ ఎస్ ఎస్.. ఏం జరుగుతోంది?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుమారు ఏడు రాష్ట్రాల నుంచి భారీ సెగతగులుతోంది. వీటిలో ఒక రాష్ట్రం లో బీజేపీ నేరుగా అధికారంలో కూడా ఉండడం గమనార్హం;
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుమారు ఏడు రాష్ట్రాల నుంచి భారీ సెగతగులుతోంది. వీటిలో ఒక రాష్ట్రం లో బీజేపీ నేరుగా అధికారంలో కూడా ఉండడం గమనార్హం. అయినప్పటికీ.. మోడీకి వ్యతిరేకంగా ర్యాలీ లు.. నిరసనలతో సదరు రాష్ట్రం అట్టుడుకుతోంది. లాఠీ చార్జీలకు సైతం ఎవరూ వెనుదిరగడం లేదు. ఈ పరిణామాలతో బీజేపీ సైద్ధాంతిక విభాగం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ఉన్న 80 వేలకు పైగా ఆర్ ఎస్ ఎస్ కేంద్రాల ద్వారా మోడీ వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
ఏం జరిగింది?
మూడు కీలక విషయాలపై బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో మోడీకి వ్యతిరేకంగా విమర్శలు, వివాదాలు తెరమీదికి వచ్చాయి.
1) త్రిభాషా సూత్రం.
2) కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గించేయ డం.
3) పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన.
ఈ మూడు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కర్నాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఒడిసాలోని పట్నాయక్ నేతృత్వంలో ఉన్న విపక్షం, పుదుచ్చేరి సహా మరికొన్ని రాష్ట్రాల్లో మోడీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు.
త్రిభాషా సూత్రంతో హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. అదేవిదంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో సింహభాగం ఇస్తున్నారని, తమను ఎండబెడుతున్నారన్నది రెండో ఆరోపణ. మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది చేయతలపెట్టిన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తద్వారా తమ తమ రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాలు తగ్గిపోతాయ న్నది ఆయా రాష్ట్రాల అధికార పార్టీలు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే శనివారం నిర్వహించే తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్ సమావేశానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. భవిష్యత్తులో మోడీని ఎలా ఎదుర్కొనాలనే విషయంపై దృష్టి పెట్టనున్నారు.
మోడీకి అండగా..
ఇలాంటి కీలకసమయంలో రాజకీయేతర సంస్థగా గుర్తింపు పొందిన బీజేపీ సైద్ధాంతిక విభాగం.. ఆర్ ఎస్ ఎస్ రంగంలోకి దిగింది. విపక్షాలు రాజకీయ యాగీ చేస్తున్నాయని.. తమ తమ అవినీతి, అక్రమ పరిపాలనలను దాచిపెట్టుకునేందుకు.. ఇలా మోడీని టార్గెట్ చేస్తున్నాయని బెంగళూరులో జరుగుతున్న ఆర్ ఎస్ ఎస్ మహాసభల్లో సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో మోడీకి అండగా.. దేశవ్యాప్తంగా ఆర్ ఎస్ ఎస్ ఉద్యమించాలని తీర్మానం చేశారు. 80 వేల ఆర్ ఎస్ ఎస్ కేంద్రాల ద్వారా.. ప్రజలను చైతన్యం చేయడంతోపాటు.. ప్రతిపక్షాల రాజకీయాలను కట్టడి చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించడం గమనార్హం.