కెనడాలో కొడుకు చనిపోవడంతో ఇండియాలో తల్లి దారుణం!
అనంతరం ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది.. కుమారుడు లేని లోకం లో తాను ఉండనని నిర్ణయించుకుంది..
కెనడా లోని మిస్సిసాగా లో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న 24 ఏళ్ల భారతీయ విద్యార్థి గుర్విందర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బ్రిటానియా - క్రెడిట్ వ్యూ రోడ్ ల సమీపంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అతని వాహనాన్ని దొంగిలించే ప్రయత్నం లో హింసాత్మకంగా దాడిచేసి చంపేశారు.
అనంతరం స్థానికులు గుర్తించి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అనంతరం చికిత్స పొందుతూ జులై 14న ఆ ఇండియన్ స్టూడెంట్ మృతి చెందినట్లు టొరంటో లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. ఈ సమయం లో గుర్విందర్ మృతదేహాన్ని ఈ నెల 27న భారత్ కు తరలించనున్నట్లు అప్పట్లోనే అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగా.. ఈ నెల 27న గుర్విందర్ మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం తిరిగి షాహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాకు తీసువచ్చారు. ఈ సందర్భంగా మరో హృదయ విదారకమైన ఘటన వెలుగు చూసింది. గుర్విందర్ తల్లి (51) తన కుమారుడి ని కోల్పోయిన బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.
అవును... కెనడా లో తన కుమారుడి అకాల మరణంతో అతడి తల్లి తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని పోలీసుల ప్రాథమిక విచారణ లో వెళ్లడైందని తెలుస్తోంది. అయితే గుర్విందర్ ఈ నెల 14నే మరణించినప్పటికీ ఆ విషయం అతడి తల్లికి తెలియకుండా కుటుంబసభ్యులు జాగ్రత్త పడ్డారు.
అయితే విషయం తెలుసుకున్న అనంతరం ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది.. కుమారుడు లేని లోకం లో తాను ఉండనని నిర్ణయించుకుంది.. ఫలితంగా ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికంగా ఈ విషయం సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న హృదయాలు ధ్రవిస్తున్నాయి!
కాగా... జులై 9న కెనడా లోని మిస్సిసాగా ప్రాంతంలో తెల్లవారుజామున 2.10 గంటల కు పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లిన గుర్విందర్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి, అతడి వాహనాన్ని దొంగిలించారు. వాహనాన్ని దొంగిలించే క్రమంలో ప్రతిఘటించిన గుర్విందర్ పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ దాడి లో గుర్విందర్ మృతి చెందాడు!
ఈ నేపథ్యంలో... గుర్విందర్ పై దాడిని ఖండిస్తూ.. అతడికి నివాళిగా సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసాగాలో క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా... "గుర్విందర్ మృతి ఎంతో బాధాకరం.. అతడి కుటుంబసభ్యుల కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.." అని టొరంటో లోని భారత కాన్సులేట్ జనరల్ సిద్ధార్థ్ నాథ్ ప్రకటించారు.