ఒకే ఒక్క దారుణం.. ఎన్ని పర్యవసానాలు..?!
ఇక, ఈ కేసులో పోలీసులు సస్పెండ్ అయ్యారు. మచ్చుమర్రి గ్రామంలో హైటెన్షన్ నెలకొని పదుల సంఖ్యలో కుటుంబాలు.. పిల్లలను తీసుకుని పొరుగు జిల్లాలకు వెళ్లిపోయారు.
ఒక్క ఘటన.. ఒకే ఒక్క దారుణ ఘటన.. ఇప్పుడు అనేక పర్యవసానాలకు దారితీస్తోంది. అదే.. నంద్యాల జిల్లా మచ్చుమర్రి బాలిక అత్యాచారం.. అనంతర హత్య. ఇక్కడితో ఈ దారుణం ఆగిపోలేదు. సదరు బాలిక మృత దేహాన్ని కృష్ణానదిలో కలిపేశారు. అది కూడా రాళ్లు కట్టి పడేశారు. ఇప్పటికీ ఆ బాలిక మృత దేహం ఆచూకి కనిపించలేదు. అయితే.. అనంతర పరిణామాలు మరింత తీవ్రంగా మారాయి. ఈ కేసును ఛేదించడంలో విఫలమయ్యారంటూ.. సీఐ, ఎస్సై సహా.. డీఐజీని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అంటే.. ముగ్గురు మైనర్లు ఒక బాలికను ఆడుకుందాం.. రమ్మని పిలిచి యూట్యూబ్‌లో చూసి మరీ అత్యా చారం చేయడం.. అనంతరం.. చంపేయడం.. ఘటనే దారుణమని భావిస్తే.. దాని తర్వాత చోటు చేసు కుంటున్న పరిణామాలు మరింత తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఈ కేసు ఛేదించే బాధ్యతలను తీసుకున్న పోలీసులు.. బాలిక మృత దేహాన్ని మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించాడని భావించిన హుస్సేన్ అలియాస్ యోహాన్ పై రెచ్చిపోయారు. ఫలితంగా గుండెపోటుతో యోహాన్ చనిపోయాడని పోలీసులు చెబుతున్నా.. వైద్యుల రిపోర్టులు దీనికి భిన్నంగా ఉన్నాయి.
ఇక, ఈ కేసులో పోలీసులు సస్పెండ్ అయ్యారు. మచ్చుమర్రి గ్రామంలో హైటెన్షన్ నెలకొని పదుల సంఖ్యలో కుటుంబాలు.. పిల్లలను తీసుకుని పొరుగు జిల్లాలకు వెళ్లిపోయారు. చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. జరిగిన అనేక ఘటనల్లో ఇది మరింత హైలెట్ అయిపోయింది. ప్రభుత్వ ప్రమేయం ఉందని ఎవరూ అనడం లేదు. కానీ, కంట్రోల్ చేయాల్సిన రీతిలో ఏర్పడిన లోపాలు.. రాజకీయంగా ఈ ఘటనను ప్రొజెక్టు చేసే పరిస్థితి.. వంటివి చివరకు బాలిక సహా.. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. బాధిత కుటుంబం సహా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబాలు కూడా.. జిల్లా విడిచిపోయాయి.
ఇది ఎవరి తప్పు..? అని ప్రశ్నిస్తే.. సరిగా కేసును డీల్ చేయలేకపోయిన.. పోలీసులు. పర్యవేక్షణ లోపంతో రాజకీయ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన నేతలదే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేసినా.. కళ్లముందు కనిపిస్తున్న సాక్ష్యాలను ఎవరూ తుడిచి పెట్టలేరు. కానీ, న్యాయం మాత్రం కడుదూరంలోనే ఉండిపోయింది.