జగన్.. ఈ విషయం తెలుసుకో: నారా లోకేష్
తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను రూ.600 కోట్లను విడుదల చేసింది.;
ఏపీ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాము ఇదే విధానాన్ని అనుసరిస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం బకాయిపెట్టిన సొమ్ములను ఆయా ఉద్యోగులు, విద్యార్థులకు చెల్లిస్తున్నామని చెప్పారు. అంతేకాదు.. ఆయా కార్యక్ర మాలను కూడా అమలు చేస్తున్నామన్నారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను రూ.600 కోట్లను విడుదల చేసింది. ఈ సొమ్ములు.. జగన్ హయాంలో చెల్లించాల్సి ఉందని.. కానీ, ఆయన చెల్లించకుండా విద్యార్థులను మోసం చేసి వెళ్లిపోయారని.. కానీ, తాము విద్యార్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందు లు ఉన్నప్పటికీ.. బకాయి నిధులు విడుదల చేసినట్టు మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను కూడా ఇస్తున్నామన్నారు.
కానీ, జగన్ అధికారం చేపట్టిన తర్వాత.. గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పనులను నిలిపి వేశారని లోకేష్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నిర్మించారన్న కారణంగా రూ.9 కోట్ల విలువైన ప్రజాభవన్‌ను నేల మట్టం చేశారని, రాజధాని అమరావతిని నిలిపివేసి.. మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడారని గుర్తు చేశారు. అంతేకాదు.. చంద్రబాబు హయాంలో నియమితులైన ఏపీపీఎస్సీ చైర్మన్ సహా అనేక మందిని బలవంతంగా పంపించేశారని గుర్తు చేశారు.
కానీ, ఒక ప్రభుత్వం.. గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను కొనసాగించాలని లోకేష్ సూచించా రు. అది రాజ్యాంగ ధర్మమని, ప్రజాస్వామ్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ విషయాలను జగన్ తెలుసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. జగన్ వంటి నిరంకుశ మనస్తత్వం.. ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదక రమని లోకేష్ చెప్పారు. అయినా.. వాస్తవాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.