భారత న్యాయ వ్యవస్థ గొప్పతనం ఇదే... బాబు పిక్ వైరల్!
చట్టం దృష్టిలో అంతా సమానమే అంటారు. అయితే ఈ విషయాన్ని పలువురు బహిరంగంగానే అంగీకరించనప్పటికీ... కొన్ని సందర్భాలు మాత్రం ఈ విషయాన్ని బలపరుస్తున్నారు.
చట్టం దృష్టిలో అంతా సమానమే అంటారు. అయితే ఈ విషయాన్ని పలువురు బహిరంగంగానే అంగీకరించనప్పటికీ... కొన్ని సందర్భాలు మాత్రం ఈ విషయాన్ని బలపరుస్తున్నారు. చట్టం ముందు సామాన్యుడు అయినా సీఎం అయినా సమానమే అనే విషయాన్ని మరింత బలపరిచేలా తాజాగా జరిగిన సంఘటననూ ప్రస్థావిస్తున్నారు పరిశీలకులు.
శనివారం ఉదయం ఆరు గంటలకు ఏపీ సీఐడీ, చంద్రబాబుని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ క్షణం నుంచి కోర్టులో తీర్పు వచ్చే వరకూ చంద్రబాబు కూడా సామాన్యుడిలానే నడుచుకోవాల్సిన పరిస్థితి కనిపించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయలో ఆదివారం ఉదయం కోర్టులోకి వెళ్లినప్పటినుంచి... తీర్పు వచ్చే వరకూ చంద్రబాబు కోర్టు హాలులోనే ఉండిపోయారు.
మాజీ ముఖ్యమంత్రి హోదాగా కావొచ్చు.. సీనియర్ సిటిజన్ కోటాలో కావొచ్చు.. తన వాదన వినిపించిన అనంతరం బయటకు వెళ్లి కుర్చోవచ్చని న్యయామూర్తి ఆఫర్ ఇచ్చినా కూడా... కోర్టు లోనే సామాన్యుడిలానే రాత్రివరకూ కూర్చుని ఉన్నారు. మద్యమధ్యలో మంచి నీళ్లు తాగుతూ... కోర్టు హాలు కిటికీలోంచి బయటకు చూస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.
లోకేష్ సహా సుమారు 200 మంది టీడీపీ తరుపు న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో తీర్పు కోసం ఉత్కంటగా ఎదురుచూస్తుండగా.. మరోవైపు తీర్పు అనుకూలంగా వస్తే సంబరాలు చేసుకునేందుకు టీడీపీ శ్రేణులు పడిగాపులు కాస్తుండగా... తీర్పు కోసం విజయవాడ ఏసీబీ కోర్టు హాలులో ఎదురుచూస్తున్నట్లుగా ఈ పిక్ లో కనిపించారు చంద్రబాబు.
మరోవైపు విజయవాడలోని ఏసిబి కోర్టు దగ్గర పోలీసు బలగాలను భారీ ఎత్తున మోహరించారు. బందోబస్తు నేపథ్యంలో ఏసీబీ కోర్టుకు వచ్చిన సిపి క్రాంతిరాణా అక్కడే ఉండి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సమయంలో కోర్టుకి సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో రోడ్లన్నీ పోలీసుల కంట్రోల్ లోకి వెళ్లిపోయాయి.