పెళ్లి కార్డును తలపిస్తున్న ఎన్నికల ప్రచార కరపత్రం!
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నన్నపనేని నరేంద్ర ఈ ప్రయోగం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు.. వారిని తమవైపు తిప్పుకొనేందుకు నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరికి తోచిన పంథాలో వారు ప్రజలకు చేరువ అవుతున్నారు. ఏం చేసినా ఎన్నికల్లో గెలిచి, అసెంబ్లీలో అడుగు పెట్టడమే లక్ష్యంగా నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కి సబాంనందించి అయన అభిమానులు చేసిన ప్రయోగం అందరినీ సోషల్ మీడియా లో ఆకర్షిస్తోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అభిమానులు తన నియోజకవర్గం ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. అయితే.. ఇవి.. పెళ్లిళ్ల సమయం లో పంచే శుభలేఖలను పోలి ఉండడం..అ చ్చం అలానే ముద్రించడం.. ఆసక్తిగా మారింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నన్నపనేని నరేంద్ర అభిమానులు ఈ ప్రయోగం చేశారు. తనకు మద్దతుగా నిలవాలంటూ.. నియోజకవర్గం ప్రజలకు ఆయన అభిమానులు వినూత్న రీతిలో పిలుపునిచ్చారు అని సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వుతుంది.
తన వివరాలను పేర్కొంటూ.. తనను గెలిపించాలని అభ్యర్థిస్తూ.. నన్నపనేని నరేంద్ర అభిమానులం అంటూ ముద్రించిన కరపత్రాలు.. అచ్చం వివాహ ఆహ్వాన పత్రికలను పోలిఉండడం.. అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సంప్రదాయ వ్యూహం వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం అయితే.. ఈ కరపత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.