నాలుగు ఉంగరాలతో కలిపి మోడీ ఆస్తుల వివరాలివే!

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చివరి దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది

Update: 2024-05-14 14:08 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చివరి దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఆ దశలో ప్రధాని మోడీ పోటీ చేయబోయే ఉత్తరప్రదేశ్ లోనూ పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో... యూపీలోని వారణాసి లోక్ సభ స్థానానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తెరపైకి వచ్చిన ఆయన ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

అవును... యూపీలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి మోడీ మూడోసారి పోటీ చేయనున్నారు. దీంతో... మంగళవారం వారణాసి కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకంటే ముందు కాశీలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు.

అంతకు ముందు సోమవారం నాడు యూపీ సీఎం యోగితో కలిసి మోడీ భారీ రోడ్‌ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి ఈ నామినేషన్ కార్యక్రమానికి ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఇతర ముఖ్య నేతలతో పాటు ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు.

ఆ సంగతి అలా ఉంటే... ఈ రోజు ఎంపీగా నామినేషన్ వేసిన ప్రధాని మోడీ తన అఫిడవిట్‌ లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. ఈ అఫిడవిట్ ప్రకారం.. ప్రధాని మోడీ చేతిలో ప్రస్తుతం రూ.52,920 ఉండగా.. గాంధీనగర్‌ లోని ఎస్‌.బీ.ఐ బ్రాంచ్‌ అకౌంట్ లో రూ.73,304.. ఎస్‌.బీ.ఐ వారణాసి బ్రాంచ్‌ లో రూ.7వేలు ఉన్నాయి. ఫిక్స్‌ డ్ డిపాజిట్ గా రూ.2,85,60,338 ఉన్నాయని వెల్లడించారు!

అదేవిధంగా.. తనకు రూ.2,67,750 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు కూడా ఉన్నాయని మోడీ తెలిపారు. వీటితో పాటు పలు ఇన్సూరెన్స్ పాలసీలు.. మొత్తం కలిపి సుమారు రూ.3.02 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రధాని మోడీ తన అఫిడవిట్ లో వెల్లడించారు! కాగా గత 10 సంవత్సరాలుగా ప్రధానిగా కొనసాగుతున్న మోడీ... అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పని చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News