'జీడీపీ' కి కొత్త అర్థం.. ఎంతైనా ఎన్నికలు బ్రో!
ప్రస్తుతం జీడీపీ అంటే.. జీ- గ్రాస్, డీ-డొమెస్టిక్, పి-ప్రొడక్ట్. అనే అర్థం ఉంది. దీనిని తెలుగులో సాదారణం గా.. తలసరి ఆదాయం అని అంటున్నాం.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రినిర్మాలా సీతారామన్.. తాజాగా ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ మొత్తంగా.. కేంద్ర ప్రభుత్వ గొప్పులు.. శ్వోత్కర్షలతోనే నిండిపోయింది. ముఖ్యంగా ఎవరూ చేయంది తాము చేశామని.. తాము కాబట్టే చేశామని.. చెప్పుకోవడం గమనార్హం. ఇక, దేశవ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా .. ఆర్థిక పరిస్థితిని ఉద్దేశించి వాడే `జీడీపీ`కి నిర్మలమ్మ కొత్త అర్థం చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం జీడీపీ అంటే.. జీ- గ్రాస్, డీ-డొమెస్టిక్, పి-ప్రొడక్ట్. అనే అర్థం ఉంది. దీనిని తెలుగులో సాదారణం గా.. తలసరి ఆదాయం అని అంటున్నాం. ఈ తలసరి ఆదాయంలో భారత్ గత యాభై ఏళ్ల రికార్డును ఎప్పుడో దాటేసిందని నిర్మలమ్మ చెప్పుకొచ్చారు. ప్రజల ఆదాయం 50 శాతం మేరకు పెరిగిందని వివరించారు. ``ఇప్పుడు దేశ ప్రజల కు ఆనందంగా ఉన్నారు. వారి చేతిలో సొమ్ములు ఉంటున్నాయి. వారి జీడీపీ పెరిగింది``అని నిర్మలా సీతారామన్ అన్నారు.
ఈ క్రమంలో తమ ప్రభుత్వం మరో జీ-డీ-పీకి ప్రాధాన్యం ఇస్తోందని నిర్మలమ్మ చెప్పుకొచ్చారు. జీ-గవర్నెన్స్ (పాలన), డీ-డెవలప్‌మెంట్(అభివృద్ది), పీ-పెర్ఫార్మెన్స్(సామర్థ్యం)లకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీ-డీ-పీకి ఎనలేని ప్రాధాన్యం ఉంటుందని.. ఇప్పటికే తమ ప్రభుత్వం పారదర్శక, జవాబు దారీ పాలనకు పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చారు. మొత్తంగా.. జీడీపీకి ఇప్పుడు కొత్తగా.. పాలన, అభివృద్ధి, సామర్థ్యం అనే కొత్త నిర్వచనం ఇవ్వడం ద్వారా.. ఆర్థికంగా దేశం వెలిగిపోయిందని చెప్పుకోవడం గమనార్హం.