కష్టపడుతున్నాం.. వ్యవస్థలను కాపాడుతున్నాం: పవన్ కల్యాణ్
కర్నూలు జిల్లాలో శనివారం పర్యటించిన పవన్ కల్యాణ్ పూడిచర్లలో పంట కుంట నిర్మాణానికి శంకుస్థాప న చేశారు.;
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అందరూ కష్టపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో గత వైసీపీ పాలన లో భ్రష్టు పట్టిన వ్యవస్థలను తాము కాపాడుతున్నామని ఉద్ఘాటించారు. గతంలో అన్ని వ్యవస్థలను ధ్వం సం చేశారని.. వాటిని గాడిలో పెట్టేందుకు నెలల సమయం పట్టిందని.. దీనిని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడానికి కూడా టైం తీసుకుందన్నారు.
కర్నూలు జిల్లాలో శనివారం పర్యటించిన పవన్ కల్యాణ్ పూడిచర్లలో పంట కుంట నిర్మాణానికి శంకుస్థాప న చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. అయితే.. పార్టీ అభిమానులు, మెగా అభిమానులు.. పవన్ పేరును పదే పదే ప్రస్తావించి సభలో హల్చల్ చేయడంతో పవన్ ఒకానొక సందర్భంగా విసుగు చెందారు. ``నా పేరు బదులు వేంకటేశ్వరస్వామి పేరును స్మరిస్తే.. మీకు పుణ్యమైనా దక్కుతుంది`` అని సరదాగా వ్యాఖ్యానించారు.
అనంతరం.. పవన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పారు. చంద్రబాబు నాయకత్వానికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. ప్రపంచ జల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. బలమైన, అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబుపై పొగడ్తల జల్లు కురిపించారు. ఆయన వల్లే గత ఏడాది తాను చేపట్టిన పల్లె పండుగ విజయవంతం అయిందని చెప్పారు.
గతంలో సీఎం చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడు.. తామంతా ఏకమయ్యాయమని.. దానిని ప్రజలు ఆశీ ర్వదించారని పవన్ చెప్పారు. గత ఎన్నికల్లో విజయాన్ని అందరి విజయంగా పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంంలోనే కర్నూలు జిల్లాలో 75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మించినట్టు తెలిపారు. 98 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను, గ్రామాలను కూడా పట్టించుకోలేదని ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. అందుకే వ్యవస్థలు దారుణంగా తయారయ్యాయని వ్యాఖ్యానించారు.