పవన్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్... పిక్ వైరల్!

ప్రస్తుతం పవన్ కల్యాణ్ అంటే... ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే

Update: 2024-06-18 13:46 GMT

ప్రస్తుతం పవన్ కల్యాణ్ అంటే... ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపొయిన ఆయన.. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం స్టార్ పొలిటీషియన్ గా మారారు. ఈ సమయంలో పవన్ కి సంబంధించిన ఓ ఫోటో వైరల్ గా మారింది.

అవును... ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ అతిపెద్ద హాట్ టాపిక్. ఏపీలో నేడు కూటమి ప్రభుత్వం కొలువుదీరిందంటే అందులో పవన్ పాత్ర అత్యంత కీలకం అనే చెప్పాలి. ప్రత్యర్థులు సైతం కెప్టెన్ చంద్రబాబు అయినా... మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం పవన్ కల్యాణ్ అని నొక్కి చెపుతున్న పరిస్థితి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒకే ఒక లక్ష్యంతో ఎన్నో ఇబ్బందులు, విమర్శలూ ఇంటా బయటా వచ్చినా.. అటు చంద్రబాబు కోసం ఎంతో బలంగా నిలబడటమే కాకుండా... టీడీపీ - జనసేన కూటమితో జతకట్టడానికి కేంద్రంలో బీజేపీ పెద్దలను ఒప్పించడంలోనూ పవన్ కీలక పాత్ర వహించారు. ఆ విషయాన్ని పలుమార్లు ఆయనే తెలిపారు కూడా.

ఈ క్రమంలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అద్భుతమైన వీజయాన్ని నమోదు చేసింది. ఈ సమయంలో నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో జనసేన అధినేత నేడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నాలుగు కీలక శాఖలకు మంత్రిగానూ మారారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫోటో వైరల్ గా మారింది.

Read more!

ఇందులో భాగంగా.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైనప్పుడు ఆయనను పరామర్శించకుండా పవన్ ను అడ్డుకున్నప్పుడు.. ఆయన నడిరోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు నాడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఆ సమయంలో పవన్ చుట్టూ పోలీసులు గుమిగూడారు.

కట్ చేస్తే... ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన ఫోటోలు కలిపిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

నాడు నడిరోడ్డుపై పవన్ పడుకుంటే... చుట్టూ పోలీసులు ఉన్నారు. ఈ రోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ రెండు ఫోటోలు కలిసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ కి ఈ ఫోటో గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News