త‌న ద‌గ్గ‌ర వార‌స‌త్వ రాజ‌కీయాలు ప‌నిచేయ‌వంటూ ..ప‌వ‌న్ హాట్ కామెంట్స్‌

జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2024-07-16 04:12 GMT

జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా రాజ‌కీయాల‌లో ప‌రిపా టిగా మారిన వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న ద‌గ్గ‌ర వార‌స‌త్వ రాజ‌కీయాలు ప‌నిచేయ‌వంటూ వ్యాఖ్యానించారు. త‌న‌పై వార‌సుల విష‌యంలో ఒత్తిడులు వ‌స్తున్నాయ‌ని.. ప‌ద‌వుల కోసం.. వార‌సుల‌ను తీసుకువ‌స్తున్నార‌ని.. కానీ.. వీటిని తాను స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఆయ‌న స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా వార‌స‌త్వ రాజ‌కీయాల గురించి మాట్లాడుతూ.. త‌ను వ్య‌క్తిగ‌తంగా ఎద‌గాల‌ని కోరుకునే నాయ‌కుడిన‌ని తెలిపారు.

వార‌స‌త్వాన్ని, క‌ర్త‌సంబంధాన్ని రాజ‌కీయాల‌కు జోడించి.. ప్ర‌జ‌ల నెత్తిన రుద్దాల‌నుకునే నాయ‌కుడిని కాద‌న్నారు. ప‌లు కుటుంబాల నుంచి కొత్త తరం నాయకులు రావడం ముందావ‌హ‌మేన‌ని చెప్పిన ఆయ‌న అయితే.. ముందుగా వారిలో స‌త్తాను నిరూపించుకోవాల్సి ఉంటుంద‌న్నారు. అంతేకానీ.. వ‌చ్చీ రావడంతోనే ప‌దవులు ఇచ్చేసి.. ప్ర‌జ‌ల‌పై రుద్దుతామంటే..కుద‌ర‌ద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండి.. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై.. ప్ర‌జా నాయ‌కులుగా గుర్తింపు తెచ్చుకుంటే.. త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు.

ఆ త‌ర్వాత‌.. ప‌దవులు అవే వ‌స్తాయ‌ని ప‌రోక్షంగా కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జ‌న‌సేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. వాటిని కాద‌ని.. త‌న‌ను ఇబ్బంది పెట్టొద్ద‌ని సూచించారు. జనం కోసం కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. పార్టీ నిర్మించుకున్న సిద్ధాంతాల‌ను గాలికి వ‌దిలేసే నాయ‌కుడిని కాద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప‌వ‌న్ రావాలి.. గెల‌వాల‌నే సంప్ర‌దాన్ని వ‌దిలేయాల‌ని.. ఎవ‌రికివారు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని సూచించారు. వ్య‌క్తిగ‌తంగా ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. త‌న సిద్ధాంతాల‌ను మాత్రం వ‌దులుకునే వాడిని కాద‌ని ప‌వ‌న్ తేల్చి చెప్పారు. త‌న‌కే కాదు.. పార్టీలో ఉన్న ప్ర‌తి నాయ‌కుడికి కూడా.. జ‌న‌సేన సిద్ధాంతాలు అర్ధం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌న‌ తీరు ఏం మారదని

తెలిపారు. ఈ విషయాన్ని అంతా అర్థం చేసుకోవాల‌ని చెప్పారు. నాయ‌కులుగా కుటుంబాల‌కు ఎంతైనా చేసుకోవా లని, కానీ, వార‌సులు వ‌స్తున్నారంటూ.. జాబితాతో సిద్ధం కావొద్ద‌ని మెత్త‌గా మాట్లాడుతూనే గ‌ట్టిగా సందేశం ఇచ్చారు. వార‌స‌త్వాన్ని పెంచుకుంటూ పోతే కొత్త త‌రానికి చోటు ఎక్కడ ఉంటుందని ప్ర‌శ్నించారు. గెలిచిన ప్రజాప్రతినిధులంతా ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పార్టీ తీసుకున్న మంత్రి పదవులు కూడా ప్రజలతో ముడిపడినవేన‌ని తెలిపారు.

Tags:    

Similar News