పేర్ని నానిని అలా ఉపయోగించుకుంటారా ?

ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ నేతలకు అధినేతకు మధ్య ఒక గ్యాప్ అయితే ఉంది. దాంతో ఎవరూ అధినాయకత్వాన్ని కలసి తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

Update: 2025-02-17 18:30 GMT

వైసీపీలో సమూలమైన మార్పులకు వైసీపీ అధినేత జగన్ శ్రీకారం చుడుతున్నారు అని అంటున్నారు. ఆయన ముందుగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆఫీసుతో నేరుగా అనుసంధానం ఉండాలని భావిస్తున్నారు అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమికి పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహణ తీరు కూడా ప్రధాన కారణం అని అంటున్నారు.

ఇక వైసీపీ కేంద్ర కార్యాలయం ఇంచార్జిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పనిచేస్తున్నారు. ఆయన పనితీరు పట్ల పార్టీ నేతల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అంటున్నారు. ఆయన మరో నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి చాలా సన్నిహితంగా ఉంటారని ప్రచారం చేస్తున్నారు. ఈ ఇద్దరి కను సన్ననలలోనే వైసీపీ కేంద్ర కార్యాలయం కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి.

ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ నేతలకు అధినేతకు మధ్య ఒక గ్యాప్ అయితే ఉంది. దాంతో ఎవరూ అధినాయకత్వాన్ని కలసి తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారు అని అంటున్నారు. దీని మీద అధినాయకత్వం దృష్టి సారించింది అని అంటున్నారు. దాంతో లేళ్ళ అప్పిరెడ్డి ప్లేస్ లో మాజీ మంత్రి పేర్ని నానిని నియమించాలని చూస్తున్నారు అని అంటున్నారు.

నాని ఎపుడూ పార్టీ కేంద్ర కార్యాలయానికి అందుబాటులో ఉంటారని అంటున్నారు. ఆయన పార్టీ నేతలతో కూడా సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. ఇక ఆయన అధినాయకత్వానికి క్యాడర్ కి మధ్య అనుసంధానంగా పనిచేస్తారు అన్న నమ్మకం అయితే హై కమాండ్ లో ఉందిట.

నాని ఇటీవల కాలంలో కొన్ని కేసుల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆయన మళ్ళీ పార్టీ కార్యక్రమాలలో బిజీ అవుతారని అంటున్నారు. ఇక ఆయనను ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించాలని అనుకున్నా ఆయన అందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదని అంటున్నారు.

దాంతో ఆయనను ఇపుడు వైసీపీ కేంద్ర కార్యాలయం ఇంచార్జిగా నియమించి మరో విధంగా ఆయన సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ ఆఫీసుని క్యాడర్ కి నాయకులకు మరింత దగ్గర చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు అధినేతతో నేరుగా అందరికీ కలిసే వీలు కల్పించాలని భావిస్తున్నారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే వైసీపీలో పేర్ని నానికి కీలక పదవి లభిస్తుందని అంటున్నారు. ఆయన పార్టీకి జగన్ కి విధేయుడిగా ఉంటున్నారు, అలాగే క్యాడర్ తో కూడా బాగా ఉంటారు అన్న కారణంతోనే ఈ నియామకం తొందరలో జరగవచ్చు అని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంత వరకూ వాస్తవాలు ఉన్నాయో కొద్ది రోజులలో తేలనుంది.

Tags:    

Similar News