మోడీకి డొనాల్డ్ ట్రంప్ స్పెషల్ గిఫ్ట్... స్పెషాలిటీ ఇదే!
అమెరికా పర్యటనలో ఉన్న మోడీ.. డొనాల్డ్ ట్రంప్ తో వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధానికి అమెరికా ప్రెసిడెంట్ ఓ ప్రత్యేక బహుమతిని ఇచ్చారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా... ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు డొజ్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత సంతతి పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి లను కలిశారు. ఈ సమయంలో మోడీకి డొనాల్డ్ ట్రంప్ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది మోడీకి బాగా నచ్చిందని చెబుతున్నారు.
అవును... అమెరికా పర్యటనలో ఉన్న మోడీ.. డొనాల్డ్ ట్రంప్ తో వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధానికి అమెరికా ప్రెసిడెంట్ ఓ ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. ఈ సందర్భంగా.. తానే స్వయంగా రాసిన "అవర్ జర్నీ టుగెదర్" అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఇది ఇద్దరికీ సంబంధించిన పలు ఈవెంట్లతో ఉన్న ఫోటో బుక్.
డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో చోటు చేసుకున్న పలు కీలక సందర్భాలు ఈ ఫోటో బుక్ లో ఉండగా.. ఇందులో ప్రధానంగా 2019 నాటి మోడీ అమెరికా పర్యటనలో నిర్వహించిన "హౌడీ మోడీ".. ఆ తర్వాత 2020లో భారత్ కు డొనాల్డ్ ట్రంప్ విచ్చేసినప్పుడు ఏర్పాటు చేసిన "నమస్తే ట్రంప్" కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి!
ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని మోడీకి ట్రంప్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ పుస్తకంలో "మిస్టర్ ప్రైం మినిస్టర్.. యు ఆర్ గ్రేట్" అని రాసి, సంతకం చేశారు ట్రంప్.
మరోపక్క.. ట్రంప్ తో భేటీ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై మోడీ చర్చలు జరిపారు. అనంతరం వీరిద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా... ఇరు దేశాల పరస్పర వాణిజ్య, రక్షణ బంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు ఇరువురూ తెలిపారు. ఈ సందర్భంగా యూఎస్ పర్యటన ముగించుకుని మోడీ భారత్ కు తిరుగుపయనమయ్యారు.