షాకింగ్... దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో తెలుసా?
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో... అన్ని రాజకీయ పార్టీలూ ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయాయి.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో... అన్ని రాజకీయ పార్టీలూ ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయాయి. ఈ సమయంలో దేశంలో అసలు ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి.. వాటిలో గుర్తింపు ఉన్న పార్టీలు ఎన్ని.. జాతీయ పార్టీలు ఎన్ని.. ప్రాంతీయ పార్టీలు ఎన్ని.. వాటి వాటి వ్యవస్థాపక దినోత్సవాలు ఏమిటి అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం...!
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ సాధారణంగా అతికొద్ది పార్టీల పేర్లు మాత్రమే దేశవ్యాప్తంగా వినిపిస్తుంటాయి. అయితే... వాస్తవానికి భారతదేశంలో సుమారు 2600కు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయనే విషయం ఎంతమందికి తెలుసు? అయితే ఇందులో గుర్తింపు లేని పార్టీలు సుమారు 2597 ఉండగా... 57 ప్రాంతీయ పార్టీలు, 6 జాతీయ పార్టీలు మాత్రమే గుర్తింపులో ఉన్నాయి! అందుకే సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ స్థాయిలో అతికొద్ది పార్టీల పేర్లే ప్రముఖంగా వినిపిస్తుంటాయి.
జాతీయ పార్టీ అంటే ఏమిటి?
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ప్రమాణాలకు అనుగుణంగా దేశంలోని రాజకీయ పార్టీలు జాతీయ రాజకీయ పార్టీగా వర్గీకరించబడతయి. ఈ క్రమంలో... 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీ.. జాతీయ పార్టీగా అర్హత సాధించాలంటే రెండు అర్హతలు కలిగి ఉండాయి. అప్పుడు సదరు పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కుతుంది.
ఇందులో భాగంగా... లోక్ సభ / అసెంబ్లీకి ఎన్నిక ఒక పార్టీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువగా ఆ రాష్ట్రాల్లో పోలైన చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం 6% సాధించి ఉండాలి. అదనంగా.. కనీసం నాలుగు లోక్ సభ స్థానాలను సొంతం చేసుకోవాలి. ఇదే సమయంలో... సార్వత్రిక ఎన్నికలలో కనీసం 2% లోక్ సభ స్థానాలను పొంది ఉండటంతోపాటు.. మూడు వేర్వేరు రాష్ట్రాలు వీటిలో కనీసం ఒక సీటును సాధించి ఉండాలి!
ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయి. అవి... భారతీయ జనతాపార్టీ (బీజేపీ), కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్.పీ.పీ). వీటిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవస్థాపక దినం 6 ఏప్రిల్ 1980 కాగా... కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం 28 డిసెంబర్ 1885! వీటిలో కొత్తగా వచ్చిన జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక దినం 26 నవంబర్ 2012 కాగా... నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్.పీ.పీ) వ్యవస్థాపక దినం 6 జనవరి 2013!
కాగా... 1951లో తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 14 జాతీయ పార్టీలు పాల్గొన్నాయి. ఈ క్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఆరు జాతీయ పార్టీలు మాత్రమే పోటీలో ఉండనున్నాయి. అంటే... అప్పటితో పోలిస్తే ఇప్పుడు జాతీయ పార్టీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నమాట.