జనసేనకు పోతిన మహేష్ రాజీనామా.. నెక్ట్స్ ఏంటి?
ఇక, ఇప్పుడు విజయవాడకు చెందిన కీలక నాయకుడు, నగరాలు.. సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత పోతిన మహేష్ అనుకున్నట్టుగానే చేశారు.
ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ దక్కని నాయకులు.. దక్కదని ముందే ఊహించిన నాయకులు చాలా మంది పార్టీ మారారు. అయితే.. కొందరు దక్కదని తెలిసి.. వేరే వారికి టికెట్ ఇచ్చేస్తున్నారని తెలిసి.. కూడా పోరాటాలు చేసి సాధించుకున్నారు. ఉదాహరణకు కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం దీనికి ఉదాహరణ. దీనిని వేరే వారికి ఇస్తున్నారని తెలిసి.. బోడే ప్రసాద్ టీడీపీపై ఒత్తడి తెచ్చి మరీ సాధించారు. ఇక, అనపర్తి సీటును వేరేవారికి ఇచ్చేసినా.. పట్టుబట్టి మరీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దక్కించుకుంటున్నా రు.
అయితే.. ఇదంతా టీడీపీ వ్యవహారం. ఇక్కడ ఈ పార్టీలో పట్టు విడుపులు కనిపిస్తున్నాయి. తన పంతానికే చంద్రబాబు పెద్దపీట వేయడం లేదు. క్షేత్రస్తాయిలో నాయకుల మాట వింటున్నారు. కొన్ని కొన్ని సంద ర్భాల్లో తప్పకపోతేనే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. జనసేనలో ఇప్పటి వరకు ఇలాంటి పట్టువిడుపులు కనిపించలేదు. పోతే పో! నన్ను ప్రశ్నించడానికి వీల్లేదన్నట్టుగానే జనసేన అధినేత పవన్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక నాయకులు కొందరు మౌనంగా ఉన్నారు.
కానీ, ఒకరిద్దరు మాత్రం పార్టీలు మారుతున్నారు. ఇటీవల తిరుపతి టికెట్ ఆశించిన ప్రముఖ వ్యాపార వేత్త, జనసేన నేత, గంటా నరహరి.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీకి జై కొట్టారు. ఇక, ఇప్పుడు విజయవాడకు చెందిన కీలక నాయకుడు, నగరాలు.. సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత పోతిన మహేష్ అనుకున్నట్టుగానే చేశారు. ఆయన టికెట్ కోసం.. చాలానే పోరాటం చేశారు. చివరి వరకు ఎక్కడా వెన్ను చూపకుండా టికెట్ కోసం.. ప్రయాస పడ్డారు.
కానీ, టికెట్ రాలేదు. పోనీ.. స్వాంతన అయినా.. వస్తుందని అనుకున్నారు.అ దికూడా రాలేదు. దీంతో ఇప్పుడు జనసేనకు రాజీనామా చేశారు. గత నాలుగు రోజులుగా ఆయన వైసీపీకి టచ్‌లోకి వెళ్తారనే చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన జనసేనకు రాజీనామా చేయడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరినట్టు అయింది. ఏదేమైనా.. బీసీ నాయకుడు.. ఎన్నికలకు ముందు పవన్‌ను వీడిపోవడం.. పార్టీపై ప్రభావం పడుతుందనే అంచనాలు వస్తున్నాయి.