ఆ ఎమ్మెల్యేకు షాకిచ్చిన కార్యకర్తలు !
దీంతో మరుసటి రోజే రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను పిలిపించుకుని భేటీ అయ్యి కాంగ్రెస్ లోకి ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చే ప్రయత్నం చేశాడు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బిగ్ ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తనతో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో మరుసటి రోజే రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను పిలిపించుకుని భేటీ అయ్యి కాంగ్రెస్ లోకి ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చే ప్రయత్నం చేశాడు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కార్యకర్తలతో సమావేశం అయిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు షాక్ తగిలింది. ఉద్యమపార్టీ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లడం మంచిది కాదని, వెళ్తే మీరు వెళ్లండి. మేము మాత్రం మీ వెంట వచ్చే పరిస్థితి లేదు. పార్టీ మారడం మూలంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని క్యాడర్ తేల్చిచెప్పారు. దీంతో మీ వెంటె నేను. మీరు కాదంటే నేను పార్టీ మారను అని ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ గౌడ్ కు కాంగ్రెస్ వల విసిరింది. కార్యకర్తల వ్యతిరేకతతో ప్రకాష్ గౌడ్ చేరికకు వెనక్కి తగ్గడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామం ఇతర ఎమ్మెల్యేల చేరికకు ప్రతికూలంగా మారడం కాంగ్రెస్ పార్టీకి ఒకింత కొరుకుడు పడని పరిణామం అనే చెప్పాలి.