జైలు గార్డును బంధించిన ఖైదీలు... వేడి ఆహారం కావాలంట!
వివరాళ్లోకి వెళ్తే... మిచిగన్ లోని సెయింట్ లూయీస్ ఫెసిలీటీ జైలులోని ఖైదీలు ఫుడ్ విషయంలో కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.
జైలులోని ఖైదీలకు సరైన ఆహారం ఇవ్వడం లేదని, నిబంధనలకు అనుగుణంగా మంచి ఆహారం అందించడం లేదని ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇవి కేవలం ఆరోపణలు కాదు.. వాస్తవాలు అనేవారూ లేకపోలేదు. అయితే ఈ విషయాన్ని కొంతమంది ఖైదీలు సీరియస్ గా తీసుకున్నారు.
అవును... జైలులో సరైన ఆహారం పెట్టడం లేదని, మంచి ఆహారం అందించడం లేదని ఖైదీలు తిరగబడ్డారు. మిచిగన్ లోని ఒక జైలులో ఖైదీలకు అందించే ఆహారం విషయంలో వారు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ఖదీలంతా కలిసి ఒక గార్డుని బంధించారు.
వివరాళ్లోకి వెళ్తే... మిచిగన్ లోని సెయింట్ లూయీస్ ఫెసిలీటీ జైలులోని ఖైదీలు ఫుడ్ విషయంలో కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. తమకు ఆహారంలో చికెన్, పిజ్జాలు కావాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతీరోజూ వేడి ఆహారం వడ్డించాలని కోరారు. అలా అని మామూలుగా చెబితే ప్రభుత్వం పెద్దలు వినరని భావించారో ఏమో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా సుమారు 70ఏళ్ల వయసున్న గాడ్ ను బంధించారు. తమ డిమాండులు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో... తర్వాత జరిగిన పరిణామాల అనంతరం ఆ గార్డుకు ఎటువంటి హాని తలపెట్టకుండా, మర్నాటి ఉదయం విడిచిపెట్టారు.
అయితే ఈ జైలులో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదని తెలుస్తోంది. ఈ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2021లో ఇక్కడి ఖైదీలు అల్లర్లకు పాల్పడి, జైలులోని కిటికీలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో జైలు ఉన్నతాధికారి ఒకరు రాజీనామా చేశారు.
తాజాగా ఈ విషయాలపై కరెక్షన్స్ కమీషనర్ జెన్నిఫర్ క్లెమన్స్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఇద్దరు ఖైదీలు ఈ సంఘటనను ప్రారంభించారని తెలిపారు. వారిద్దరికీ క్రమశిక్షణా ఉల్లంఘనల విషయంలో సుదీర్ఘ చరిత్ర ఉందని అన్నారు. అనంతరం ఎక్కువ మంది ఖైదీలు పాల్గొన్నారరని తెలిపారు. అయితే పరిస్థితి ఎలా జరిగిందనే కోణంలో పూర్తి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు!