రాహుల్ ఎంపీ హోదా పై అనుమానాలు

ఎందుకంటే రాహుల్ పై వేటువేయటమే బీజేపీ టార్గెట్. ఇక్కడ నియమ, నిబంధనలు, సంప్రదాయాలు అన్నీ అనవసరం.

Update: 2023-08-05 04:32 GMT

రాహుల్ గాంధి లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ పై అనేక అనుమానాలు మొదలైపోయాయి. గుజరాత్ లోని సూరత్ కోర్టు విధించిన రెండేళ్ళ జైలుశిక్ష కారణంగా రాహుల్ పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన విషయం తెలిసిందే. నిజానికి అప్పట్లోనే లోక్ సభ సెక్రటేరియట్ ఓవర్ యాక్షన్ చేసింది.

ఎందుకంటే సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ళు జైలుశిక్ష విధించినా దాని అమలుకు నెలరోజులు గడువిచ్చింది. కాబట్టి లోక్ సభ కూడా నెలరోజులు ఆగాల్సిందే. కానీ కోర్టు ఇలా తీర్పిచ్చిందో లేదో వెంటనే లోక్ సభ సెక్రటేరియట్ రంగం లోకి దిగేసి రాహుల్ ను అనర్హుడిగా ప్రకటించేసింది.

అప్పట్లో ఎంత స్పీడుగా అయితే అనర్హుడిగా ప్రకటించిందో ఇపుడు సుప్రింకోర్టు స్టే కారణంగా అంతే వేగంగా పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి కదా. కానీ అలాచేస్తుందనే నమ్మకం ఎవరిలోను లేదు. ఎందుకంటే రాహుల్ పై వేటువేయటమే బీజేపీ టార్గెట్. ఇక్కడ నియమ, నిబంధనలు, సంప్రదాయాలు అన్నీ అనవసరం. ప్రత్యర్ధుల ను దెబ్బకొట్టాలంటే కొట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది మోడీ వ్యవహారం.

అర్జంటుగా రాహుల్ ఎంపీ హోదాను పునరుద్ధరిస్తే 8,9,10 తేదీల్లో కేంద్రప్రభుత్వం పై జరిగే అవిశ్వాస తీర్మానంలో రాహుల్ పాల్గొంటారు. పాల్గొనటమే కాకుండా మోడీ ప్రభుత్వం పై విరుచుకుపడిపోతారు. తన పై మోడీ ప్రభుత్వం ఏ విధంగా కక్షకట్టిందో దేశం మొత్తానికి వినిపిస్తారు. రాహుల్ స్పీచ్ మొత్తం రికార్డలకు ఎక్కుతుంది. అందుకనే ఇప్పటికప్పుడు పునరుద్ధరణ జరుగుతుందనే నమ్మకం కలగటంలేదు. తీర్పు కాపీని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి లోక్ సభ సెక్రటరీకి అందించారు.

రూల్స్ ప్రకారం వెళ్ళాలంటే ఒకవిధంగాను రూల్సును ఖాతరుచేయకూడదంటే మరోరకంగాను ఉంటుంది. రాహుల్ ఎంపీ పదవి ని లోక్ సభ సెక్రటరీ పునరుద్ధరించాలంటే అందుకు స్పీకర్ ఓంబిర్లా ఓకే చెప్పాలి. ఓంబిర్లా ఓకే చెప్పాలంటే అందుకు మోడీ అనుమతించాలి.

ఒకపుడు లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ పైన విధించిన అనర్హత వేటును కోర్టు కొట్టేసింది. అహ్మద్ ఎంపీ పదవిని పునరుద్ధరించేందుకు రెండు నెలలు పట్టింది. అదికూడా ఎంపీ మళ్ళీ కోర్టుకెళ్ళి కోర్టు థిక్కారం కింద కేసు వేసే సమయంలో ఎంపీ పదవిని పునరుద్ధరించారు. మరి రాహుల్ విషయంలో ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News