బోర్లా పడ్డ బోడె రాంచంద్రయాదవ్ !
2019 ఎన్నికల్లో జనసేన తరపున పుంగనూరులో పోటీ చేసి 16,452 ఓట్లు సాధించి రాష్ట్రంలో జనసేన సగటు కన్నా ఎక్కువగా 8.4 శాతం ఓట్లు సాధించడం గమనార్హం.
బోడె రాంచంద్రయాదవ్ గత నాలుగేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పేరు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం దాసర్లపల్లెలో ఇల్లు నిర్మించి వివిధ రంగాల సెలబ్రిటీలను తీసుకురావడం, ఏకంగా రాందేవ్ బాబా రావడం అందరి దృష్టిని ఆకర్షించాడు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సై అంటే సై అన్నాడు. ఏకంగా కేంద్ర హోమంత్రిని కలిసి వై కేటగిరి భద్రత కూడా తెచ్చుకోవడం విశేషం.
సొంతంగా భారత చైతన్య యువజన పార్టీని స్థాపించాడు. తెలంగాణ, ఏపీలలో వివిధ పట్టణాలు తిరుగుతూ హంగామా చేశాడు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పుంగనూరులో పోటీ చేసి 16,452 ఓట్లు సాధించి రాష్ట్రంలో జనసేన సగటు కన్నా ఎక్కువగా 8.4 శాతం ఓట్లు సాధించడం గమనార్హం.
అయితే ఈ సారి తన సొంతపార్టీ భారత చైతన్య యువజన పార్టీ తరపున పుంగనూరుతో పాటు, మంగళగిరిలో పోటీ చేసి పెద్ద ఎత్తున్న ప్రచారం చేశాడు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి బోడె రాంచందర్ యాదవ్ కు మంగళగిరిలో కేవలం 194 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ ఇప్పటి వరకు నోటాకు 413 ఓట్లు వచ్చాయి. సొంత నియోజకవర్గం పుంగనూరులో 4286 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ నోటాకు 2665 ఓట్లు రావడం గమనార్హం.