బాబాయ్ గెలుపు .. అబ్బాయి సంబురం !

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది.

Update: 2024-06-06 09:41 GMT

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. జనసేన తరపున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏపీలో కూటమి ఊహించని విధంగా భారీ విజయం సాధించింది.

గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానంలో ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుండి 70 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించడమే కాకుండా పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించాడు. పవన్ విజయంపై మెగా ఫ్యామిలీతో పాటు మహేష్ బాబు , ఎన్టీఆర్, వెంకటేష్, దళపతి విజయ్, సూపర్ స్టార్ రజినీకాంత్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. బాబాయ్ గెలుపును రామ్ చరణ్ ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేయనున్నాడని తెలుస్తుంది. హైదరాబాద్ లో జరిగే ఈ పార్టీకి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలుస్తుంది.

Tags:    

Similar News