పెను విషాదం: ఫ్రిడ్జ్ పేలి ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి!

దీపావళి సమయంలో బాణసంచా పేలి ఎంతోమంది మరణించడం, శరీరాలు తీవ్రంగా కాలిపోవడం జరుగుతుంటుంది

Update: 2023-10-10 04:19 GMT

దీపావళి సమయంలో బాణసంచా పేలి ఎంతోమంది మరణించడం, శరీరాలు తీవ్రంగా కాలిపోవడం జరుగుతుంటుంది. ఇదే సమయంలో కెమికల్ ఫ్యాక్టారీలలోనూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ... ఎవరూ ఊహించని రీతిలో ఇంట్లోఉన్న ఫ్రిడ్జ్ పేలిపోతే.. ఆ ఊహించని పరిణామం ఎంతటి విషాదాన్ని మిగులుస్తుందనే సంఘటన తాజాగా జరిగింది. ఈ ప్రమాదంలో ఒకె కుటుంబంలో ఆరుగురు చనిపోయారు.

అవును... ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ పేలింది. దీంతో ఇంట్లో ఉన్న ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఇంతటి అత్యంత విషాధరకరమైన సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ బలైపోయింది. మృతుల్లో ఏకంగా ముగ్గురు చిన్నారులు ఉండటం మరింతగా కలిచివేస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లాలో ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి ఫ్యామిలీ అంతా హాయిగా కూర్చుని టీవీ చూస్తున్నారు. హాలిడే అవ్వడంతో ఇంటిల్లపాదీ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ సమయంలో హఠాత్తుగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. వెంటనే భారీగా మంటలు చెలరేగాయి.

దీంతో ఈ ఊహించని పరిణామతో ఆ సమయంలో ఇంట్లో ఉన్న యశ్ పాల్ గాయ్ (70), ఆయన కుమారుడు ఇంద్రపాల్ (41), కోడలు రుచి గాయ్ (40) తో సహా వారి ముగ్గురు చిన్నారులు మానస, దియా, అక్షయ్ లు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. అయితే వీరిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన ఇంద్రపాల్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.

ఇక పేలుడుకు గల అసలు కారణం ఫ్రిడ్జేనా లేక మరేదైనా ఉందా అనే కోణంలో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిళ్లను సేకరించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ఇలా ఒకే కుంటుంబానికి చెందిన ఆరుగురూ ఒకేసారి మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

Tags:    

Similar News