మార్చి 7న గుంటూరుకు రేవంత్ రెడ్డి

ఇందులో భాగంగా మార్చి 7న గుంటూరులో జరగనున్న తొలి సభకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు.

Update: 2024-03-02 14:18 GMT

ఏపీలో మరో 40 రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. సభలు, సమావేశాలు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకాలు వంటి విషయాలతో అధికార వైసీపీ, టీడీపీ-జనసేన పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఇక, ఆలస్యంగా ఎన్నికల రేసులోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా తమ సత్తా చాటేందుకు, రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవాన్ని తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా వరుస సభలు నిర్వహించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా మార్చి 7న గుంటూరులో జరగనున్న తొలి సభకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు.

ఇటీవల వైసీపీ ప్రభుత్వం పై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా, డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికతో పాటు రాష్ట్ర స్థాయి నేతలను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు మొదలుబెట్టింది. ఏపీలోనూ కర్ణాటక, తెలంగాణలలో ఇచ్చిన హామీల మాదిరిగా హామీలు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందని తెలుస్తోంది. రాబోయే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల అవకాశం ఉన్న నేపథ్యంలో మార్చి ఏడో తారీఖున గుంటూరులో కాంగ్రెస్ భారీ సభకు ఏర్పాటు చేస్తోంది.

ఈ సభకు టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధమాయ్య, కాంగ్రెస్ కీలక నేతలు హాజరు కాబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీలు, మేనిఫెస్టో ఈ సభలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యేక హోదా తో పాటు పోలవరం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News