'మిస్ యూనివర్స్ ఇండియా 2024'గా 18 ఏళ్ల రియా... నెక్స్ట్ టార్గెట్ అదే!!

మిస్ యూనివర్స్ ఇండియా - 2024 కిరీటాన్ని రియా సింఘా సొంతం చేసుకున్నారు.

Update: 2024-09-23 06:45 GMT

మిస్ యూనివర్స్ ఇండియా - 2024 కిరీటాన్ని రియా సింఘా సొంతం చేసుకున్నారు. తాజాగా జైపూర్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో రియా సింఘా గెలుపొందారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా... 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఊర్వశీ రౌతేలా వ్యవహరించారు. ఈ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది.

అవును... ఈ ఏడాది జైపూర్ లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో రియా సింఘా గెలుపొందారు. ఈ సందర్భంగా స్పందించిన రియా సింఘా... ఈ రోజు ఈ టైటిల్ గెలుచుకోవడం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడం కోసం ఎంతో కష్టపడినట్లు తెలిపారు.

ఇదే సమయంలో... నేడు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉందని చెప్పిన ఆమె... గతంలో ఈ పోటీల్లో గెలిచిన వారిని స్పూర్తిగా తీసుకున్నట్లు తెల్లిపారు. కాగా... గుజరాత్ కు చెందిన రియా సింఘా... 18 ఏళ్ల వయసులోనే ఈ అందాల పోటీల్లో గెలిచి అందరినీ ఆకర్షించారు.

ఇక ఈ కార్యక్రానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన 2015 మిస్ యూనివర్స్ ఇండియా విజేత ఊర్వశీ రౌతేలా... ఈ కిరీటాన్ని రియా గెలుచుకోవడ్దంపై సంతోషం వ్యక్తం చేశారు. "గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024"లో భారత్ కు రియా ప్రాతినిథ్యం వహించనుందని తెలిపారు. రియా గ్లోబల్ మిస్ యూనివర్స్ పోటీల్లోనూ విజేతగా నిలవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదే క్రమంలో... ఈ పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలు అంతా ఎంతో కష్టపడ్డారని.. వారి అంకితభావం ఆశ్చర్యపరిచిందని ఊర్వశీ రౌతేలా అన్నారు. 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ రియా సింఘా ఈ కిరీటాన్ని సొంత చేసుకున్నారు.

కాగా... మిస్ యూనివర్స్ 2024 పోటీలు మెక్సికో నగరంలో నవంబర్ 14, 16 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. సుమారు 17 సంవత్సరాల తర్వాత ఈ అందాల పోటీలు తిరిగి మెక్సికోలో జరగనున్నాయి.

Tags:    

Similar News