కొత్త పిలుపు... లంచ్ బ్రేక్ ను సంతానోత్పత్తికి వాడుకోండి!

ప్రపంచంలోని కొన్ని దేశాలకు జనాభా పెరుగుదల సమస్యగా ఉంటే.. ఇంకొన్ని దేశాలకు తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు అతిపెద్ద సమస్యగా పరిణమిస్తోంది.

Update: 2024-09-17 06:09 GMT

ప్రపంచంలోని కొన్ని దేశాలకు జనాభా పెరుగుదల సమస్యగా ఉంటే.. ఇంకొన్ని దేశాలకు తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు అతిపెద్ద సమస్యగా పరిణమిస్తోంది. దీంతో ఆయా దేశాలు వారి వారి యువతకు సంతానోత్పత్తి పై దృష్టి పెట్టాలని సూచిస్తూ, అందుకు భారీ భారీ బహుమతులు కూడా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయంలో పలు దేశాలు ఇప్పటికే వివాహాలు చేసుకోవాలని, అనంతరం పిల్లలను కనాలని యువతకు రిక్వస్టులు పెడుతూ, వరుస సెలవులు ఇస్తూ, ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుతోంది. ఈ సమయంలో తాజాగా.. ఎలాగైనా జనాభాను పెంచండి, దేశ సేవ చేయండి అంటూ పిలుపునిస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

అవును... ఓ పక్క తగ్గుతున్న జననాల రేటు, దానికి తోడు రెండున్నరేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ తో యుద్ధంలో బలైపోతున్న దేశ యువత.. మరో పక్క నిర్భంధంగా సైన్యంలో చేరాల్సి రావడంతో పెరుగుతున్న దేశాని వీడుతున్న వారి సంఖ్య వెరసి రష్యాకు ఇప్పుడు జనాభా సమస్య వచ్చింది. ఈ దేశంలో జనాభా గణనీయంగా తగ్గిపోతుంది.

దీంతో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ దేశ ప్రజలకు సరికొత్త పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా... రోజూ పని మధ్యలో లంచ్, కాఫీ బ్రేక్ టైం లో కూడా సంతానోత్పత్తికి ప్రయత్నించాలని.. ఫలితంగా జనాభాను పెంచి దేశ సేవ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో... ఈ పిలుపుపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు.

ఇదే విషయంపై స్పందించిన రష్యా ఆరోగ్య మంత్రి యెవగనీ షెప్తోపలోవ్... రోజంతా పనిలో ఉంటున్నామనే పసలేని సాకులు చెప్పకండి.. సృష్టికార్యానికి ఆఫీసు పని ఏమాత్రం అడ్డంకి కారాదు.. లంచ్ బ్రెక్, కాఫీ బ్రేక్.. ఇలా ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు.

కాగా... జననాల రేటును పెంచడానికి రష్యా ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అబార్షన్ నిబంధనలను అత్యంత కష్టసాధ్యంగా మార్చేసింది. మరోపక్క తొలి కాన్పునకు ఏకంగా రూ.9.4 లక్షల బహుమతిని ప్రకటించింది. పిల్లల్ని కని పెంచడమే మహిలల ప్రధాన బాధ్యత అంటూ మతపెద్దలతో చెప్పిస్తోంది!

Tags:    

Similar News