రష్యాలో ఘోరం..నావల్నీ డెడ్ బాడీ తరలించేందుకు తిప్పలు
ఇక నావల్నీ అంత్యక్రియలకు కూడా వేదిక దొరకని పరిస్థితిలో అతి కష్టం మీద ఆయన బృందం ఓ వేదికను ఏర్పాటు చేయగలిగింది. చాలామంది బిజీగా ఉన్నామని, వేదికలు లేవని చెబుతున్నారు.
రష్యా ప్రతిపక్ష ఉద్యమ నేత అలెక్సి నావల్నీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించేందుకు ముప్పుతిప్పలు పెట్టిన రష్యా ప్రభుత్వం చివరకు ఆయన మృతదేహాన్ని తరలించేందుకు వాహన డ్రైవర్లను ముందుకు రానీయకుండా ఇబ్బందులు పెడుతోంది. ఒకవేళ ఎవరైనా డ్రైవర్ నావల్నీ మృతదేహాన్ని తరలించేందుకు ముందుకు వస్తున్నా గుర్తు తెలియని వ్యక్తులు ఆ డ్రైవర్లను బెదిరిస్తున్నారని తెలుస్తోంది.
ఇక నావల్నీ అంత్యక్రియలకు కూడా వేదిక దొరకని పరిస్థితిలో అతి కష్టం మీద ఆయన బృందం ఓ వేదికను ఏర్పాటు చేయగలిగింది. చాలామంది బిజీగా ఉన్నామని, వేదికలు లేవని చెబుతున్నారు. ఎలాగోలా మాస్కోలో నావల్నీ అంత్యక్రియలు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు భావించారు. ఎలాగోలా వేదిక దొరికితే..చివరకు ఆయన డెడ్ బాడీ తరలించేందుకు వాహనం, డ్రైవర్ దొరకని పరిస్థితి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ను విమర్శించే నావల్నీపై 2021లో విష ప్రయోగం జరిగింది. జర్మనీ నుంచి రష్యా వస్తున్న సమయంలో ఆయనపై విషాన్ని ప్రయోగించారు. దీంతో, జర్మనీలో ఆయన చికిత్స పొంది కొద్ది కాలం క్రితమే రష్యాకు వచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన సైబీరియాలోని పీనల్ కాలనీలో నావల్నీ మరణించారు. జైలు అధికారులు నావల్నీ మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించేందుకు నానా తిప్పలు పెట్టారు. ఇక, తన భర్త మరణం వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హస్తం ఉందని ఆయన భార్య లిడియా సంచలన ఆరోపణలు చేశారు. ఐరోపా పార్లమెంట్లో ప్రసంగించిన ఆమె ఈ ఆరోపణలు చేశారు. నావల్నీ మృతికి కారకులని భావిస్తున్న వారిపై అమెరికాతో పాటు పవ్చిమ దేశాలు నిషేధం విధించాయి.