స్ట్రాంగ్ కౌంటర్... పవన్ కత్తితో పొడుచుకుంటాడా?

ఇదే క్రమంలో... సీఎంపై జరిగిన దాడిపై ప్రతిపక్షాలన్నీ ఒకేలా మాట్లాడుతున్నాయని ఫైర్ అయిన సజ్జల... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే డ్రామా అనడం సరికాదని అన్నారు.

Update: 2024-04-15 15:29 GMT

"మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విజయవాడలో జరిగిన దాడికి సంబంధించిన రాజకీయ ప్రకంపణలు ఇంకా హీటెక్కుతున్నాయి! ప్రధానంగా... జగన్ పై ఓ ఆగంతకుడు చేసిన దాడిపై టీడీపీ నేతలు నుంచి వస్తున్న కామెంట్లు, వాటికి వైసీపీ నుంచి తిరిగొస్తున్న కౌంటర్లతో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ గా మారాయి! ఈ సమయంలో ఆయనకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు!

అవును.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వీజయవాడ బస్సు యాత్రలో ఓ ఆగంతకుడు చేసిన దాడిపై టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్లు ఒకెత్తు అయితే... జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరొకెత్తు అన్నట్లు ఉన్నాయని అంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జగన్‌ కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైసీపీ నాయకులు హడావుడి చేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు!

ఇదే సమయంలో.. ఎన్నికలు రాగానే వైఎస్‌ జగన్‌ కు ఏదోలా గాయమవుతుందని, ఎవరో ఒకరు చనిపోతారని అన్నారు. దీంతో... ఈ కామెంట్లపై తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా.. సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని.. జగన్‌ పై జరిగిన దాడిని భద్రతా వైఫల్యం అంటున్న టీడీపీ నేతలు, ఏం వైఫల్యమో చెప్పడం లేదని మండిపడ్డారు.

ఇదే క్రమంలో... సీఎంపై జరిగిన దాడిపై ప్రతిపక్షాలన్నీ ఒకేలా మాట్లాడుతున్నాయని ఫైర్ అయిన సజ్జల... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే డ్రామా అనడం సరికాదని అన్నారు. వైఎస్‌ జగన్‌ కు నాటకాలు, డ్రామాలు అడటం రాదని చెబుతూ.. చంద్రబాబు దాడిని ఖండిస్తున్నామంటూనే డ్రామాలు అని అంటున్నారని మండిపడ్డారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో పవన్‌ కే అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.

ఎవరైనా వారిపై వారే దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించిన సజ్జల... డ్రామాలు అని అంటున్న వారు ఎవరైనా రాయితో కొట్టించుకోగలారా? పవన్‌ కత్తితో పొడిపించుకుంటాడా? రాయితో కొట్టించుకుంటాడా? అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. విషయాన్ని డైవర్ట్‌ చేయడానికి ప్రతిపక్షాలు ప్రయతిస్తున్నారని.. వారి విమర్శలను వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు!

Tags:    

Similar News