బండారు బూతు పంచాంగం... రోజా భర్త రియాక్షన్ వైరల్!

బండారుపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది. ఈ సమయంలో ఆ సభ్య వ్యాఖ్యలపై రోజా భర్త ఆర్కే సెల్వమణి రియాక్ట్ అయ్యారు.

Update: 2023-10-02 12:57 GMT

ఏపీ టూరిజం మంత్రి ఆర్కే రోజాపై.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన అసభ్యకరమైన, అసహ్యమైన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సంస్కారం ఉన్నవారు ఎవరూ సమర్ధించరనే కామెంట్లు మహిళా లోకం నుంచి బలంగా వినిపించాయి. ఈ సమయంలో రోజా భర్త సెల్వమణి స్పందించారు.

అవును... మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన బూతు పురాణంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో... ఏపీ మహిళా కమిషన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. బండారుపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది. ఈ సమయంలో ఆ సభ్య వ్యాఖ్యలపై రోజా భర్త ఆర్కే సెల్వమణి రియాక్ట్ అయ్యారు.

రోజా గురించి ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో చూడగలిగినంత మాత్రమే చూడగలిగాలని తెలిపారు. ఈ సందర్భంగా రోజా రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడే "డోన్ట్ క్రై" అని చెప్పినట్లు సెల్వమణి తెలిపారు. రాజకీయాల్లో మగవాళ్లపై అవినీతి ఆరోపణలతో విమర్శిస్తే... ఆడవారిని విమర్శించాల్సి వచ్చినప్పుడు మాత్రం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారని, అది తట్టుకుని నిలబడగలిగేతే రాజకీయాల్లోకి వెళ్లమని చెప్పినట్లు తెలిపారు.

ఇదే సమయంలో ఇలాంటి నీచమైన సంఘటనలు జరిగినప్పుడు ఖండించం అవసరం అని తెలిపిన సెల్వమణి... ఈ విషయంపై లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో తన భార్యకు సంబంధించిన వీడియోలు ఉంటే వెంటనే బయట పెట్టాలని తాను సత్యనారాయణకు చెబుతున్నట్లు సెల్వమణి అన్నారు.

ఇదే సమయంలో తనకు బాలకృష్ణ కుటుంబంతో అత్యంత సన్నిహిత్యం ఉందని తెలిపిన సెల్వమణి... బ్రాహ్మణి చాలా చిన్నగా ఉన్నప్పుడే రోజా - బాలయ్యల సినిమా షూటింగ్ లో కలిసినట్లు తెలిపారు. ఇదే సమయంలో మగాడు అంటే ఆడమనిషిని బెదిరించడం కాదని.. చెప్పిన మాటపై నిలబడేవాడే అని సెల్వమణి... బండారుకు ఇచ్చి పడేశారు.

ఇదే సమయంలో మహిళలను కించపరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని, కఠినమైన శిక్షలు ఉంటాయనే విషయం నిరూపించడం కోసమైనా.. తాము ఈ విషయంలో లీగల్ యాక్షన్ కు దుగుతున్నామని సెల్వమణి ప్రకటించారు. ఇదే సమయంలో తన భార్యను ఎవరో ఏదో అన్నారని ఏడ్చిన చంద్రబాబు... ఇలాంటి నీచులను పార్టీలో పెట్టుకుని నడిపిస్తే ఎలా అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో తన భార్య ఏమైనా తప్పుగా మాట్లాడితే తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కానీ... ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం సరైన చర్య కాదని ఫైరయ్యారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ కూతురు, ఎన్టీఆర్ కొడుకు, ఎన్టీఆర్ కోడలు అని చెబుతున్న వ్యక్తులే ఎన్టీఆర్ ని చెప్పుతో కొట్టారని, ఆయన్ని చంపేశారని సెల్వమణి ఫైరయ్యారు.

ఫైనల్ గా ఏది ఏమైనా... ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదని, లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నామని, బండారు సత్యనారాయణ ఆ వీడియోలు చూపించాలని తెలిపారు సెల్వమణి!

Tags:    

Similar News