మహారాష్ట్రలో రూటు మార్చిన బీజేపీ !

అని మహారాష్ట్ర బీజేపీ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే మీద ప్రశంసల వర్షం కురిపించడం చర్చానీయాంశమయింది.

Update: 2024-06-11 13:30 GMT

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ ఠాక్రే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, మిత్రపక్షాలైన కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీలే ఎక్కువగా లాభపడ్డాయని, శివసేన అనుకున్న సీట్లను సాధించలేదు. ఠాక్రే ఆరోగ్యం బాగా లేకుండాన్న గట్టిగా ప్రచారం చేశారు’

అని మహారాష్ట్ర బీజేపీ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే మీద ప్రశంసల వర్షం కురిపించడం చర్చానీయాంశమయింది. శివసేనను చీల్చి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకు పరిమితం అయింది.

మహారాష్ట్రలో ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. మొత్తం 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ కేవలం 09 స్థానాలు, దాని మిత్రపక్షాలైన శివసేన(షిండే) 07, ఎన్సీపీ(అజిత్ పవార్) 01 స్థానాలను మాత్రమే సాధించాయి.

మరోవైపు ఇండియా కూటమి ఏకంగా ఏకంగా 30 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్ 13, ఎన్సీపీ(శరద్ పవార్) 08, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) 09 స్థానాల్లో గెలిచారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై ఇండియా కూటమి పైచేయి సాధించింది.

ఈ ఎన్నికల్లో ఠాక్రే పార్టీ 21 సీట్లలో పోటీ చేస్తే 09 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి 13 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ చేసి 08 స్థానాల్లో గెలిచింది. బీజేపీతో శివసేన కలిసిపోతుంది అన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2019 ఎన్నికల్లో శివసేనతో విడిపోకముందు బీజేపీ కలిసి పోటీ చేసి దాదాపుగా మహారాష్ట్రలోని సీట్లను క్లీన్‌స్వీప్ చేశాయి.

Tags:    

Similar News