షోయబ్ మాలిక్-సానియా మీర్జా విడాకులకు కారణం ఇదేనా?
తాజాగా ఈ గందరగోళం అన్నింటికి సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా క్లారిటీ ఇచ్చేసారు. తన కుమార్తె కావాలని విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
షోయబ్ మాలిక్- సానియామీర్జా వ్యవహారం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. షోయబ్ మాలిక్ మూడవ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నేటి ఉదయమే పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా సంచలనమైంది. ఇంతకాలం సానియా-షోయబ్ విడాకులు తీసుకోకుండా దూరంగా మాత్రమే ఉంటున్నారని ప్రచారం సాగింది. వాటన్నింటికి షోయబ్ మాలికి ఏ కంగా పెళ్లితోనే పుల్ స్టాప్ పెట్టేసాడు. దీంతో విడాకుల అభిప్రాయం ఎవరిది? ముందుగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు? అన్న అంశంపై వాడివేడి చర్చ సాగుతోంది.
ఎందుకంటే? ఈ పెళ్లి తంతు కంటే ముందుగానే సానియా మీర్జా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ తోనే ఈ గందరగోళం నెలకొంది. 'పెళ్లి కష్టం..విడాకులు ఇంకా కాష్టం' అంటూ వ్యాఖ్యానించింది. దీంతో విడాకులు ఇవ్వడం సానియా మీర్జాకి ఇష్టం లేనట్లు నెట్టింట హైలైట్ అయింది. షోయబ్ మాలిక్ తో విడిపోవడం ఇష్టం లేకపోయినా..సానియా మీర్జా తప్పని పరిస్థితుల్లో విడాకులు ఇచ్చినట్లు ప్రచారం సాగింది. అటు షోయబ్ మాలిక్ నుంచి కూడా ఈ అంశంపై సరైన క్లారిటీ లేదు.
దీంతో విడాకుల ప్రపోజల్ అనేది ముందుగా ఎవరి నుంచి? అన్నది అస్పష్టంగానే కనిపించింది. తాజాగా ఈ గందరగోళం అన్నింటికి సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా క్లారిటీ ఇచ్చేసారు. తన కుమార్తె కావాలని విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. 'షరియా చట్టంలో ఉన్న ఖులా పద్దతి ప్రకారం ముస్లీం మహిళ భర్తకు విడాకులు ఇచ్చే స్వేచ్ఛని కలిగి ఉంది. నా కుమార్తె సానియా కూడా ఖులా ప్రకారమే షోయబ్ కి విడాకులు ఇచ్చింది' అని వెల్లడించారు.
మరి సానియా మీర్జా ఈ నిర్ణయం ఏ కారణంతో తీసుకున్నట్లు అంటే? షోయబ్ మాలిక్ ఎఫైర్ల కారణంగానే ఆమె విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. అతడి ప్రవర్తన సరిగ్గా లేని కారణంగానే అన్ని రకాలుగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించి విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. షోయబ్ మాలిక్ కి సానియా కంటే ముందుగా వివాహమైన సంగతి తెలిసిందే.