మీ స్మార్ట్ ఫోన్ మీ రహస్యాలన్నీ వింటోంది.. జాగ్రత్త?

అయితే తాజాగా స్మార్ట్ ఫోన్ డేటా గోపికపై ప్రజలలో ఆందోళన రేకెత్తుతోంది. యాక్టివ్ లిజనింగ్ టెక్నాలజీ సహాయంతో మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్ మనం మాట్లాడే మాటలను గోప్యంగా వింటున్నాయి.

Update: 2024-09-11 17:30 GMT

మనం ఏదైనా రహస్యం మాట్లాడేటప్పుడు పెద్దవాళ్లు గోడలకి చెవులుంటాయి జాగ్రత్త అంటారు. అయితే ప్రస్తుతం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గోడలకే కాదు మనం వాడే మొబైల్ ఫోన్స్ కూడా చెవులు ఉన్నాయి. అవునండి ఫోన్లు మనం ఏమైనా మాట్లాడుతున్నా రికార్డు చేసేస్తాయి. వీటికి తెలియకుండా ఆ పర్మిషన్స్ మనమే ఇస్తామన్న విషయం మీకు తెలుసా?

ఏదైనా యాప్ వాడే సమయంలో పర్మిషన్స్ గ్రాంట్ అడిగినప్పుడు మైక్రోఫోన్ పర్మిషన్ ని కూడా మనం ఆక్టివేట్ చేస్తాం. అయితే చాలా సందర్భాలలో మనం ఉపయోగించే యాప్ కు మైక్రోఫోన్ వాడకం అవసరమా లేదా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాం. అందుకే మన మొబైల్ ఫోన్స్ మనం మాట్లాడకుండా పక్కన పెట్టేసినా సరే మన మాటలు వింటూ ఉంటాయి. వీటికి సంబంధించి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఫోన్లో ఏర్పాటు చేసి ఉంటుంది అంటున్నారు టెక్ నిపుణులు.

కొన్ని సంవత్సరాలుగా ఫోన్లు మనం మాట్లాడే ప్రతి విషయాన్ని వింటాయి అన్న ప్రచారం జరుగుతూ ఉంది.. మరి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైన తర్వాత ఈ మాటను మనం తరచూ వింటున్నాం. అంతేకాదు అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించడానికి మైక్రోఫోన్లు ఉపయోగిస్తున్నట్టుగా గూగుల్, ఫేస్బుక్ లాంటి పెద్ద సంస్థలు కూడా అంగీకరించాయి. అయితే కేవలం మార్కెటింగ్ కి అవసరమైన వివరాలను మాత్రమే మేము సేకరిస్తాము అని ఈ కంపెనీలు చెబుతున్నాయి.

మీరు వేటి గురించి అయితే ఫోన్లో చర్చిస్తారో ఆ ప్రోడక్ట్స్ మీకు చూపించడానికి ఈ ఇన్ఫర్మేషన్ ని ఆ కంపెనీలు ఉపయోగిస్తాయట. అందుకే మనం దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడుతుంటామో వాటికి సంబంధించిన అడ్వటైజ్మెంట్స్ మన మొబైల్ ఫోన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఫోన్లో అమర్చబడినటువంటి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ మన మాటలను అర్థం చేసుకొని.. మనం ఏం కావాలనుకుంటున్నామో గ్రహించి వాటికి సంబంధించిన డేటా మనకు ఎక్కువగా కనిపించేలా చేస్తుంది.

అయితే తాజాగా స్మార్ట్ ఫోన్ డేటా గోపికపై ప్రజలలో ఆందోళన రేకెత్తుతోంది. యాక్టివ్ లిజనింగ్ టెక్నాలజీ సహాయంతో మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్ మనం మాట్లాడే మాటలను గోప్యంగా వింటున్నాయి. అయితే మన డేటా ప్రైవసీ మన చేతుల్లోనే ఉంది.. మీరు ఏదైనా కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ ఇచ్చే సమయంలో సదరు యాప్ కు మైక్రోఫోన్ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయించుకోండి. అంతేకాదు కొన్ని మొబైల్ ఫోన్స్ మీకు తెలియకుండా మీ ఫోటోలను కూడా తీస్తూ ఉంటాయి. కాబట్టి మీ సెల్ క్యాం ఎప్పుడు కూడా కవర్ అయి ఉండేలా చూసుకోండ

Tags:    

Similar News