ఈ ఎంఎల్ఏలో టెన్షన్ పెరిగిపోతోందా ?

దాంతో పార్టీ నేతలతో పాటు మామూలు జనాల్లో కూడా ఎంఎల్ఏపై వ్యతిరేకత పెరిగిపోయింది.

Update: 2023-08-12 06:05 GMT

భవిష్యత్తు అర్ధంకాకే ఈ మహిళా ఎంఎల్ఏలో టెన్షన్ పెరిగిపోతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచినా తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. అప్పటినుండి ఆమె పరిస్ధితి దిక్కుతోచకుండా అయిపోయింది. ఇదంతా ఎవరి విషయం అంటే రాజధాని నియోజకవర్గం తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి గురించే అని అర్ధమైపోయుంటంది. శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో చంద్రబాబునాయుడును శ్రీదేవి కలుసుకున్నారు. ఏమి మాట్లాడుకున్నారనే విషయంలో క్లారిటిలేదు.

మొత్తానికి నిరసతో వెనుదిరగటంతో భవిష్యత్తుపై ఈమెకు ఎలాంటి హామీ లభించలేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో వైసీపీ తరసున గెలిచిన శ్రీదేవి తర్వాత అనేక వివాదాల్లో కూరుకుపోయారు. దాంతో పార్టీ నేతలతో పాటు మామూలు జనాల్లో కూడా ఎంఎల్ఏపై వ్యతిరేకత పెరిగిపోయింది. అందుకనే ఆమె ఉండగానే జగన్ నియోజకవర్గానికి ఇన్చార్జిని నియమించారు. దాంతోనే ఆమెకు వచ్చేఎన్నికల్లో టికెట్ దక్కదని అర్ధమైపోయింది.

ఈ సమయంలోనే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను థిక్కరించి టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అప్పటినుండి ఆమెకు ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు. తాడికొండలో అయితే టీడీపీ తరపున ఆమెకు టికెట్ దక్కే అవకాశంలేదని ముందే తెలుసు. మరి క్రాస్ ఓటింగ్ కు ముందు చంద్రబాబు నుండి ఆమెకు ఏమి హామీ లభించిందో తెలీదు. క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ అభ్యర్ధి గెలిచిన తర్వాత ఆమె చంద్రబాబును కలవటానికి ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు.

ఏవేవో కారణాలు చెప్పి శ్రీదేవిని కలవటానికి చంద్రబాబు ఇష్టపడలేదు. మొత్తానికి ఏమి జరిగిందో ఏమో శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుతో శ్రీదేవి భేటీ అవగలిగారు. భేటీలో కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో టికెట్ అంశమే చర్చకు వచ్చుంటుందనటంలో సందేహంలేదు. అయితే చంద్రబాబు నుండి ఎలాంటి హామీ దక్కలేదని మాత్రం అర్ధమవుతోంది. ఎందుకంటే చంద్రబాబుతో భేటీ తర్వాత ఎంఎల్ఏ నిరాసతో వెనక్కు వెళ్ళిపోయారు. ఇపుడు తన భవిష్యత్తు ఏమిటనే విషయంలోనే శ్రీదేవిలో టెన్షన్ పెరిగిపోతోంది.

Tags:    

Similar News