గుజరాత్ లోని కంపెనీలో 50వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు!
ఇందులో భాగంగా ఆగస్టు 17 నుంచి ఆగస్టు 27 వరకూ ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. ఈ నిర్ణయం సుమారు 50,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపించనుందని అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాద్యం తన ప్రభావాన్ని విస్తరిస్తుంది. ఈ మేరకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్లపైకి వచ్చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో భారత్ లో ఓ ప్రముఖ వజ్రాల తయారీదారు సంస్థ తీసుకున్న ఓ నిర్ణయం ఏకంగా 50,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది! ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
అవును... గుజరాత్ లోని సూరత్ లో ఉన్న ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ కిరణ్ జెమ్స్ తన కార్యకలాపాలను 10 రోజుల పాటు మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆగస్టు 17 నుంచి ఆగస్టు 27 వరకూ ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. ఈ నిర్ణయం సుమారు 50,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపించనుందని అంటున్నారు.
అయితే... సదరు కంపెనీ ఉన్నపలంగా ఇలాంటి నిర్ణయం.. ప్రపంచ వ్యాప్తంగా పాలిష్ చేసిన వజ్రాలకు తగ్గుతున్న డిమాండ్ కు వ్యూహాత్మక ప్రతిస్పందనగా తీసుకోబడిందని జాతీయ మీడియా నివేదించింది. దీంతో... అన్ని వేల మందికి హాలిడేస్ ఇచ్చేస్తే వారి కుటుంబాల పరిస్థితి ఏమిటనే చర్చ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ వల్లభాయ్ లఖానీ స్పందిస్తూ... "మేము 10 రోజులు సెలవు ప్రకటించాము.. తద్వారా వజ్రాల ఉత్పత్తిని నియంత్రించవచ్చు" అని చెప్పారని తెలుస్తోంది. కంపెనీ చరిత్రలో ఇటువంటి నిర్ణయం తీసుకొవడం తొలిసారని అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల మొత్తం పరిశ్రమకే ప్రయోజనం చేకూరుతుందని కంపెనీ భావిస్తోందని తెలుస్తోంది.
కాగా... ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వజ్రాల తయారీ సంస్థగా పేర్కొంటున్న కిరణ్ జెమ్స్ బలమైన సంఖ్యలో శ్రామిక శక్తిని కలిగి ఉంది. ఈ సంస్థలో 50 వేల మందికి పైగా డైమండ్ పాలిషర్లు పనిచేస్తుండగా.. వారిలో 40వేల మంది సహజ వజ్రాలను కత్తిరించి పాలిష్ చేస్తారట. ఇక మిగిలిన 10వేల మందీ ల్యాబ్ లోని డైమండ్ యూనిట్ లో పని చేస్తున్నారని చెబుతున్నారు.