ఎవరు ఎక్కువ అబద్ధం చెబుతారు... తాజా సర్వే ఫలితాలివిగో!

ఇదే సమయంలో... పురుషులు తమ భాగస్వాములకు తరచుగా చెప్పే కొన్ని అబద్ధాలను కూడా సర్వే సంస్థ హైలెట్ చేసింది

Update: 2024-04-10 17:30 GMT

అబద్ధం చెప్పడం మనిషి జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయిందని అంటుంటారు. దీన్ని కవర్ చేసుకోవడానికి... “బాదపెట్టే నిజం చెప్పడం కంటే - సంతోష పెట్టే అబద్ధం చెప్పడం మంచిది” అని ఎవరికి వారు కొన్ని కొటేషన్స్ ని రాసుకున్నారని చెబుతుంటారు. ఈ సమయంలో ఈ సమాజంలో స్త్రీలు ఎక్కువగా అబద్ధాలు చెబుతారా.. పురుషులు ఎక్కువగా అబద్ధాలు చెబుతారా అనే విషయంపై ఒక సర్వే జరిగింది. ఈ సర్వే ఫలితాలు ఆసక్తిగా ఉన్నాయి!

అవును... మనిషి తన జీవితకాలంలో ఎన్నో అబద్ధాలు ఆడతాడనేది తెలిసిన విషయమే! ఈ మేరకు ఈ విషయంపై జరిగిన ఒక సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... స్త్రీ రోజుకు రెండు సార్లు అబద్ధం చెబితే... పురుషుడు ప్రతీ రోజు సగటున సుమారు మూడుసార్లు అబద్ధం చెబుతాడని ఈ సర్వేలో తేలిందంట.

తాజాగా 3000 మంది పెద్దలతో చేసిన ఈ సరికొత్త సర్వే ప్రకారం... సగటున ఒక పురుషుడు సంవత్సరానికి 1,092 అబద్ధాలు చెబుతాడని.. స్త్రీ అయితే ఒక సంవత్సరానికి 728 అబద్దాలు చెబుతాదని తేలిందంట. ఇదే క్రమంలో... అబద్దం చెప్పడం అనేది తమ మనస్సాక్షిని తినేస్తుందని 82శాతం మంది మహిళలు చెప్పగా.. 70శాతం మంది పురుషులు తమ నేరాన్ని అంగీకరించారని తేలిందని అంటున్నారు!

ఈ క్రమంలో పురుషులు చెప్పే అబద్ధాల్లో మెజారిటీ అబద్ధాలు మద్యపాన అలవాట్లకు సంబంధించినవిగా ఉంటే... "నథింగ్ రాంగ్... నేను బాగానే ఉన్నాను" అనేది అత్యంత ప్రజాదరణ పొందిన స్త్రీ చెప్పే అబద్ధం అని తేలిందని తెలుస్తోంది. ఇదే సమయంలో 10 మందిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఆఫీసుల్లో అబద్ధాలు చెప్పడాన్ని సమర్ధించుకోగా.. మూడు వంతుల మంది ప్రజలు క్రిమినల్ కేసులలో మాత్రమే అబద్ధాన్ని ఉపయోగించడం మంచిదని భావించారని తెలుస్తుంది.

ఇదే సమయంలో... పురుషులు తమ భాగస్వాములకు తరచుగా చెప్పే కొన్ని అబద్ధాలను కూడా సర్వే సంస్థ హైలెట్ చేసింది. ఇందులో భాగంగా... "నాకు సిగ్నల్ లేదు".. "నేను దారిలోనే ఉన్నాను".. "నేను ట్రాఫిక్ లో చిక్కుకున్నాను".. "సారీ... నేను మీ కాల్ చూడలేదు" అనేవి అత్యధికంగా ఉంటాయని అంటుండగా.. "ఏమీ తప్పులేదు.. నేను బాగానే ఉన్నాను".. "నాకు తలనొప్పిగా ఉంది" అనేవి స్త్రీలు ఎక్కువగా మాట్లాడే అబద్ధాలలో కొన్ని అని చెబుతున్నారు.

Tags:    

Similar News