పవన్ పార్టీ క్లోజ్ చేసుకో...జూనియర్ చేగొండి అల్టిమేట్ డిమాండ్...!
పవన్ పార్టీ క్లోజ్ చేసుకోవడం బెటర్ అని ఆయన అంటున్నారు. వైసీపీలో చేరిన సూర్యప్రకాష్ జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ మీద నిప్పులే చెరిగారు.
తాడేపల్లిగూడెం సభకు జెండా టైటిల్ పెట్టారు. దాని మీద సెటైర్లు కూడా పడ్డాయి. అపుడెపుడో ప్రజారాజ్యం పార్టీ జెండా పీకేస్తారు అని ఒక టీడీపీ అనుకూల మీడియా రాసింది. దానికి గుర్తు చేసేలా ఉంది అని అంటున్నారు. ఇపుడు సరిగ్గా అలాంటి డిమాండే మాజీ మంత్రి దిగ్గజ నేత చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ చేశారు.
పవన్ పార్టీ క్లోజ్ చేసుకోవడం బెటర్ అని ఆయన అంటున్నారు. వైసీపీలో చేరిన సూర్యప్రకాష్ జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ మీద నిప్పులే చెరిగారు. పవన్ ఎందుకు పార్టీ పెట్టారో అర్ధం కాదు అని అన్నారు. చంద్రబాబుని లోకేష్ ని సీఎం చేయడానికి పార్టీ నడుపుతున్నారా అని ప్రశ్నించారు.
పవన్ పార్టీ నేతలను నమ్మరు, ఎవరితోనూ అసలు మాట్లాడరు అని ఆయన మండిపడ్డారు. తాను ఆరేళ్ళుగా పార్టీలో ఉంటున్నా పవన్ తో మాట్లాడింది అరగంట మాత్రమే అని అన్నారు. పీఏసీ మెంబర్ గా ఉన్న తనకే ఈ విలువ ఇస్తే ఇక క్యాడర్ కి ఏమి ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు. పవన్ పార్టీ నిర్మాణం లేదు అని అంటున్నారు, ఆ తప్పు ఎవరిది అని ఆయన ప్రశించారు.
పదేళ్ళుగా పార్టీని గాలికి వదిలి ఇపుడు బహిరంగంగా నేతలను నిందిస్తారా అని మండిపడ్డారు. తాము మాట్లాడితే వైసీపీ కోవర్టులు అని బహిరంగంగా విమర్శించడం పవన్ కే చెల్లింది అని ఆయన అన్నారు. తన తండ్రి హరిరామజోగయ్యను అవసరానికి వాడుకుని ఈ రోజున ఆయనను పక్కన పెట్టారని సూర్యప్రకాష్ విమర్శించారు.
పవన్ తెర ముందు కనిపించేది వేరు తెర వెనక వేరు అని ఆయన అంటున్నారు. ఒక్క నాదెండ్ల మనోహర్ మాటలను మాత్రమే పవన్ వింటారు అని ఆయన ఫైర్ అయ్యారు. సలహాలు సూచనలు ఇవ్వవద్దు అన్న నాయకుడిని ఒక్క పవన్ లోనే చూశాను అని ఆయన అన్నారు.
ప్రజల కోసం పార్టీని ఎవరైనా పెడతారు అని బాబు కోసం పార్టీని పెట్టడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. అందుకే పార్టీని మూసుకుని పవన్ ఇంట్లో కూర్చుంటే మేలు అని ఆయన సూచించారు. ఆత్మాభిమానం చంపుకుని జనసేనలో ఉండలేకనే తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. తాను వైసీపీలో ఏ పదవీ ఆశించకుండా భేషరతుగా చేరుతున్నానని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్స్ ఉన్న నేత అని సూర్యప్రకాష్ కొనియాడారు. ఇక నుంచి తాను వైసీపీ గెలుపునకు కృషి చేస్తాను అని చెప్పారు. జనసేనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అని ఆయన జోస్యం చెప్పడం విశేషం.