మమ అంటూ మధ్యలో జగన్...కూటమి సక్సెస్ మంత్ర ?

అమరావతి రాజధాని పనులను తిరిగి ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వం మీద జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-11-01 19:30 GMT

ఏపీలో అయిదు నెలలకు చేరువ అవుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ మధ్యలో ఏమి సాధించింది అంటే ఒకటి రెండు హామీలను తప్ప ఇతరమైనవి పెద్దగా నెరవేర్చలేదు. మరిన్ని హామీలను త్వరలో విడుదల అంటూ పెండింగులో పెట్టింది. అది చేస్తాం ఇది చేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు అయితే ఇస్తున్నారు. అమరావతి రాజధాని పనులను తిరిగి ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వం మీద జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు.

మాటకు ఒకసారి జగన్ అంటూ ఆయనను గుర్తు చేస్తూ వైసీపీ అధ్వాన్న పాలన చేసింది అని విమర్శించడం బాబుతో మొదలుపెడితే మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ఇలా అంతా అదే అనుసరిస్తున్నారు. టీడీపీ కూటమికి ఏపీలో వచ్చిన సీట్లు ఓట్ల శాతం చూస్తే కనుక వైసీపీని ఎంతలా జనం దూరం పెట్టారో అర్ధం అవుతుంది.

అటువంటి వైసీపీ పాలన గురించి ఎందుకు గుర్తు చేయడం అన్నదే ఇక్కడ చర్చ. వారి పాలన బాగా లేదనే భావించి జనాలు కూటమి ప్రభుత్వాన్ని నెత్తికెత్తుకున్నారు. అంతే కాదు జగన్ కంటే బ్రహ్మాండంగా పాలిస్తారు అని కూడా భావించి జనాలు ఓట్లు సీట్లు ఇచ్చారు.

అయితే మంత్రాలు చదువుతూ మధ్యలో మమ అని అనుకోమన్నట్లుగా జగన్ గురించి జపం చేయడంతోనే కూటమికి సరిపోతుందా అన్న చర్చ వస్తోంది. ఇక టీడీపీ కూటమి సంక్షేమం ఇంకా మొదట్లోనే ఉంది. అభివృద్ధి అంతా కాగితాల మీదనే ఉంది.

ముందు వాటిని ట్రాక్ పట్టించి ఆ మీదట తాము ఏమి చేసింది జనాలకు చెప్పుకుంటే వారే ఆదరిస్తారు కదా అని అంటున్నారు. అయితే ప్రత్యర్థిని గుర్తు చేసుకోకపోతే టీడీపీ కూటమి పెద్దలకు పొద్దు పోవడం లేదులా ఉంది అని అంటున్నారు.

నిజానికి చూస్తే వైసీపీకి జనాలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. వారిని అంతలా పాతాళానికి అణచేసారు జనాలు తమదైన తీర్పుతో. ఒక విధంగా చెప్పాలీ అంటే జనాలకు వైసీపీ అన్నది ఇపుడు అవసరం లేదు. వారి చూపూ ఫోకస్ అంతా టీడీపీ కూటమి మీదనే ఉంటోంది.

అయితే దానిని మరచారో లేక ప్రత్యర్ధిని తిడితే తమకు ఎక్కువ మార్కులు పడతాయని భావిస్తున్నారో తెలియదు కానీ జగన్ అంటూ అంతా ఆయన గురించి వైసీపీ గురించే మాట్లాడుతున్నారు. దీంతో ఏపీలో ప్రతిపక్షం అన్నది లేదు అని భావించకుండా వైసీపీకి ఏ ఆయాసం కూడా లేకుండా ప్రచారం ఉచితంగా చేసి పెడుతున్నారు

ఏపీలో అధికార పార్టీ వాయిస్ ఎపుడూ బిగ్ సౌండ్ చేస్తుంది. మరి వారే ప్రత్యర్ధి పేరుని పదే పదే స్మరిస్తూంటే అది అనుకోకుండానే వైసీపీకి వరంగానే మారుతుందని అంటున్నారు. ఇక కూటమి పెద్దలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్య తేడా అని వివరించేందుకు ఇలా వైసీపీ ప్రస్తావన తెస్తున్నారా అంటే అది కూడా చూడాల్సి ఉంది.

అయితే పెద్దలు ఒకలా ఆలోచిస్తే మంత్రులు ఎమ్మెల్యేలు మరింత దానికి దట్టించి జగన్ గురించి వైసీపీ గురించి నాలుగు ఆకులు ఎక్కువగానే విమర్శలు చేస్తున్నారు. దీని వల్ల తాము పనిమంతులమని చెప్పుకోవడానికో లేక మంచి మార్కులు హై కమాండ్ నుంచి పొందడానికో ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు.

సరే ఎవరు ఎలా అనుకుంటూ వైసీపీని విమర్శించినా కూడా అది కూటమికే ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. ఎందుకంతే జనం మదిలో పెద్దగా లేని వైసీపీ ఊసుకుని తీసుకుని రావడం ద్వారా అసలైన ప్రతిపక్షం ఆ పార్టీయే అని దానికే విపక్ష హోదాను కట్టబెట్టేస్తునారు అని అంటున్నారు.

వైసీపీని విమర్శించడం సక్సెస్ మంత్ర ని కూటమి అనుకుంటే అది బూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు. కూటమి ఇకనైనా తన పాలన గురించే ఎక్కువగా చెప్పుకుని ప్రత్యర్థిని బాగా ఇగ్నోర్ చేస్తేనే అది బెటర్ బెస్ట్ పాలిటిక్స్ అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News