టీడీపీకి గవర్నర్ పదవి... ఈసారి ఛాన్స్ ఈయనకేనా!?

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-15 08:09 GMT

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రధానంగా కేంద్రంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించింది టీడీపీ. బీజేపీ తర్వాత ఎన్డీయేలో ఇప్పుడు తెలుగుదేశమే రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న పరిస్థితి. ఈ సమయంలో టీడీపీకి బిగ్ ఆఫర్ రాబోతుందని అంటున్నారు.

ప్రస్తుతం కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రస్తుతానికి టీడీపీ రెండు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. మరోపక్క గవర్నర్ పోస్టుల పంపకాలపైనా బీజేపీ దృష్టిసారించిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా పలు గవర్నర్ పోస్టులను ఎన్డీయే మిత్రపక్షాలకు ఇవ్వాలని ప్రణాళికలు రచించినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎన్డీయే కూటమిలో కీలక భూమిక పోషిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఈ మేరకు తెర వెనుక కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని.. అధికారిక ప్రకటనే తరువాయని.. ఇవాళ రేపట్లో ఆ పనికూడా పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ఈ విషయంలో చంద్రబాబు మనసులో థర్డ్ థాట్ లేదని అంటున్నారు. చంద్రబాబు మనసులో రెండు ఆలోచనలే ఉన్నాయని.. మదిలో రెండు పేర్లే ఉన్నాయని.. ఆ ఇద్దరిలో ఎవరిని గవర్నర్ పదవికి ఎంపిక చేయాలనే విషయంపైనే తీవ్ర కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు పేర్లు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి ఇటు అశోక్ గజపతిరాజు, అటు యనమల రామకృష్ణుడు... తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు మాత్రమే కాదు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు అని చెబుతారు. ఎన్నో క్లిష్ట సమయాంలో పార్టీకీ, బాబుకీ వీరిరివురూ చేయుతగా నిలిచారని అంటుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరిలో ఎవరిని గవర్నర్ చేయాలనే విషయంపై చంద్రబాబు ఇవాళ రేపట్లో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కేంద్రమంత్రి పదవి అవకాశం వచ్చినప్పుడు అశోక్ గజపతిరాజుకు ఆ అవకాశం దక్కడంతో... ఈసారి యనమలకు ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి! ఏది ఏమైనా బాబు థాట్ మాత్రం ఈ ఇద్దరిమధ్యే అనేది ఫైనల్ అంటున్నారు.

Tags:    

Similar News