ఆ రెండు స్థానాల్లో టీడీపీ ఘన విజయం

రాజమండ్రి అర్బన్ లో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55 వేల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు.

Update: 2024-06-04 06:43 GMT

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీ 127 స్థానాల్లో ముందంజలో ఉండగా, వైసీపీ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. జనసేన 19 స్థానాల్లో ముందంజలో ఉండగా బిజెపి 6 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్డీఏ కూటమి బోణీ కొట్టింది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజమండ్రి అర్బన్ లో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55 వేల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. దీంతో, ఏపీలో వెలువడిన తొలి రెండు ఫలితాలు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి.

దాదాపు 63 వేల పైచిలు ఓట్ల మెజారిటీతో గోరంట్ల గెలుపొందారు. అంతకుముందు, పోస్టల్ బ్యాలెట్ల రూపంలో, తొలి రౌండు ఈవెఎం ఓట్ల లెక్కింపులో కూడా మొదట గోరంట్ల బుచ్చయ్య చౌదరికే లీడ్ బోణీ లభించింది. 63,056 ఓట్ల భారీ మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి, వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పై గోరంట్ల గెలుపొందారు. ఏపీలో కూటమి ఘనవిజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. విజయవాడ, గుంటూరులతో పాటు ప్రాంతాలలో బాణాసంచా కాల్చి డప్పులు మోగిస్తూ తెలుగుతమ్ముళ్లు ఆనందోత్సాహాల్లో తేలుతున్నారు.

Tags:    

Similar News