వాళ్ల‌ను కాదంటే.. కేసీఆర్‌కు ఇబ్బందేనా?!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అధికార‌పార్టీలో ఉన్న నాయ‌కులు చాలా మంది తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. త‌మ‌కు టికెట్ రాద‌ని గ్ర‌హిస్తున్న వారు.. కేసీఆర్ త‌మ‌ను ప‌ట్టించుకో వ‌డం లేద‌ని భావిస్తున్న‌వారు.. దాదాపు 30 నుంచి 40 మంది నాయ‌కులు క‌నిపిస్తున్నారు.

Update: 2023-07-31 01:30 GMT

వ‌చ్చే ఎన్నిక‌లు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అత్యంత కీల‌కమ‌నే విష‌యం తెలిసిందే. ముచ్చ టగా మూడోసారి కూడా ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉండాల‌న్నా.. పార్ల‌మెంటులో త‌న బ‌లం పెర‌గాల‌న్నా.. వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు అత్యంత కీల‌కం. ఈ క్ర‌మంలో ఆయ‌నతో చేతులు క‌లిపే ప్ర‌తిపా ర్టీ, ప్ర‌తినాయ‌కుడు కూడా అత్యంత ముఖ్య‌మే. ఎవ‌రిని కాద‌న్నా.. కేసీఆర్‌కు ఇబ్బందేన‌నే చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అధికార‌పార్టీలో ఉన్న నాయ‌కులు చాలా మంది తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. త‌మ‌కు టికెట్ రాద‌ని గ్ర‌హిస్తున్న వారు.. కేసీఆర్ త‌మ‌ను ప‌ట్టించుకో వ‌డం లేద‌ని భావిస్తున్న‌వారు.. దాదాపు 30 నుంచి 40 మంది నాయ‌కులు క‌నిపిస్తున్నారు. వీరిలో కొంద‌రు సేఫ్ జోన్ చూసుకుంటున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిని ఇప్పుడు కాపాడుకోవ‌డం కేసీఆర్ అవ‌స‌రమ నే వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. ఏపుట్ట‌లో ఏ పాముందో.. అన్న‌ట్టుగా ఏ నాయ‌కుడి బ‌లం ఎలా ఉంటుందో! అనే చ‌ర్చ‌సాగుతోంది.

ఇక‌, మ‌రోవైపు కేసీఆర్‌తో చేతులు క‌లిపేందుకు.. క‌మ్యూనిస్టులు, బీఎస్పీ, ఆప్ వంటి పార్టీలు రెడీగానే ఉన్నాయి. అయితే.. వీరికి కావాల్సింది టికెట్లు. క‌మ్యూనిస్టులు మునుగోడులో సాయం చేశారు. అయితే.. ఇప్పుడు అసెంబ్లీ టికెట్ల విష‌యంలో కేసీఆర్‌కు కామ్రెడ్ల‌కు మ‌ధ్య వివాదం త‌లెత్తింది. దీంతో వారి ప‌రిస్థితి డోలాయ‌మానంలో ఉంద‌ని అనుకున్నా.. మ‌రోవైపు వారు క‌న్నుగీటితే.. క‌లిసిపోయేందుకు కాంగ్రెస్ రెడీగా ఉంది. చెరో నాలుగు సీట్లు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్న‌ట్టు తెలిసింది.

ఇక‌, బీఎస్పీ, ఆప్ వంటివి కూడా.. కేసీఆర్‌తో పొత్తుకు రెడీగా ఉన్నాయి. ఇండియాకూట‌మికి కేసీఆర్ మాదిరిగానే బీఎస్పీ త‌ట‌స్థంగా ఉంది. దీంతో ఆయ‌న ఊ అంటే.. చేతులుక‌లిపి.. ఐదు స్థానాలు ఇచ్చినా చాల‌ని కోరుతోంది. ఇక‌, ఆప్ ఇండియా కూట‌మిలో ఉన్నా.. రాష్ట్ర‌స్థాయిలో కేసీఆర్‌తో చేతులు క‌ల‌పాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. మొత్తంగా వీరు చ‌ర్చ‌ల‌కు సిద్ధంగానే ఉన్నా. .కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు.

కానీ, కేసీఆర్ కాదంటే.. వీరు కాంగ్రెస్‌తో అయినా క‌లిసేందుకు సిద్ధంగానే ఉన్నారు. సో.. ఇప్పుడు వీరిని క‌లుపుకొంటే.. కేసీఆర్‌కు మంచిద‌ని కొంద‌రు.. లేదు.. వ్య‌తిరేక ఓటు చీలిపోవాలంటే.. దూరంగా ఉండాల‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఏదేమైనా.. వీరిని క‌లుపుకొంటేనే బెట‌ర్ అని.. మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

Tags:    

Similar News