షాకింగ్: ప్రాణాలు తీసిన బర్త్ డే కేక్

కేకు విషపూరితం కావటంతోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Update: 2024-03-31 05:37 GMT

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. షాక్ కు గురయ్యే ఉదంతం పంజాబ్ లో చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకను సంబరంగా జరుపుకునే వేళ.. బర్త్ డే కేక్ ఆర్డర్ ఇవ్వటం.. దాన్ని కట్ చేయటం తెలిసిందే. ఆనందాన్ని మరింత పెంచే బర్త్ డే కేక్ అనూహ్య విషాదాన్ని నింపటమే కాదు.. కడుపుకోతను మిగిల్చింది. విషపూరితమైన కేక్ పదేళ్ల చిన్నారి ప్రాణాల్ని తీసింది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. పుట్టినరోజు వేళ ఎంతో ఆనందంగా కేక్ తిన్న చిన్నారి.. తర్వాతి రోజుకు విగతజీవిగా మారటం గమనార్హం.

పంజాబ్ లోని పటియాలాకు చెందిన పదేళ్ల చిన్నారి మాన్వి పుట్టిన రోజు ఈ నెల 24న. దీంతో ఇంట్లో పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆన్ లైన్ నుంచి స్థానిక బేకరీ లో కేక్ ఆర్డర్ చేశారు. ఈ కేక్ ను అదే రోజు సాయంత్రం 7 గంటల వేళలో కట్ చేసి.. ఇంట్లోని వారంతా తిన్నారు. అయితే.. రాత్రి పది గంటల వేళకు ఇంట్లోని వారంతా అస్వస్థతకు గురయ్యారు.

ఇదిలా ఉంటే దాహంగా ఉందంటూ మంచినీళ్లు తాగిన మాన్వి నిద్రలోకి జారుకుంది. అయితే.. ఉదయానికి ఆమె ఆరోగ్యం విషమించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేకు విషపూరితం కావటంతోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు ఎంతలా ప్రయత్నించినా వారి ప్రయత్నాలు సఫలం కాలేదు.

ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులకు బేకరీ మీద కంప్లైంట్ చేవారు. మాన్వి మ్రతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. కేక్ మీద తీవ్ర ఆరోపణలు రావటంతో వాటి శాంపిళ్లను పరీక్షల కోసం పంపారు. వీటి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. కేక్ క్వాలిటీ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తాజా ఉదంతం తెలియజేస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News