కొమ్ములున్న ఈ కీటకం చాలా కాస్ట్లీ గురూ!

ఈ భూప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు, కీటకాలు ఉండగా.. వాటిలో కొన్నింటిని మాత్రమే మనిషి ఆహారంగా తీసుకుంటాడు.

Update: 2024-02-14 02:45 GMT

కీటకం ఏమిటి.. లక్షలు రేటు పలకడం ఏమిటి.. పైగా బీఎండబ్ల్యూ కారు ధర కూడా దీనిముందు బలాదూర్ అనిపించేలా ఉండటం ఏమిటి.. అనిపించే విషయమే ఇది! కారణం... పైన చెప్పుకున్నవన్నీ వాస్తవాలే! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకానికి సంబంధించిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాని ధర.. దానివల్ల ఉపయోగాలు మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం...!

ఈ భూప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు, కీటకాలు ఉండగా.. వాటిలో కొన్నింటిని మాత్రమే మనిషి ఆహారంగా తీసుకుంటాడు. వీటిలో కొన్ని ఆరోగ్యం అందిస్తే.. మరికొన్ని మనిషి ప్రాణాలకే ప్రమాదకరంగా ఉంటాయి. ఇంకొన్ని మాత్రం మందుల తయారీలో ఉపయోగపడుతుంటాయి. దీంతో... వాటిని గురించిన విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి కీటకాల్లో ఒకటి "స్టాగ్ బీటిల్"!

అవును... ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం పేరు "స్టాగ్ బీటిల్"! కేవలం 2 నుంచి 3 అంగుళాల సైజులో ఉండే ఈ కీటకం ధర మాత్రం సైజుకీ ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా అమ్ముడైన ఈ కీటకం విలువ అక్షరాల రూ. 65 లక్షలు కావడం గమనార్హం. ప్రస్తుతం డిమాండ్ ను బట్టి కోటి రూపాయలకు పైనే పలుకుతుందని అంటున్నారు!

లుకానిడే కుటుంబానికి చెందిన ఈ భూమిపై ఉన్న అత్యంత వింతైన కీటకంగా కూడా చెబుతుంటారు. నల్లగా ఉండి తల నుంచి ముందుకు పొడుచుకుని వచ్చినట్లుగా రెండు కొమ్ముల వంటి ఆకరాలు ఉంటాయి. ఇదే సమయంలో ఇవి పెద్ద దవడలను కలిగి ఉంటాయి. వీటిలో ఆడ కీటకం దవడలు, మగ కీటకం దవడలకంటే బలంగా ఉంటాయి.

సాధారణంగా చెత్తలో ఉండే ఈ స్టాగ్ బీటిల్స్ కు కుళ్లిన కలపలోన ద్రవాలు, చెట్ల రసం, పండల రసం వంటివి ఆహారంగా ఉంటాయి. ఇవి ద్రవాల మీదనే ఆధారపడటానికి కారణం... ఇవి తినేశక్తిని కలిగి ఉండవు.. కేవలం తాగే శక్తిని మాత్రమే కలిగి ఉంటాయి. ఇక గరిష్టంగా సుమారు 7 సంవత్సరాల జీవితకాలం ఉండే ఈ కీటకాలను వివిధ రకాల మందుల తయారీలో వినియోగించడం వల్లే ఇవి అంత ఖరీదుగా ఉంటాయి.

ఇలా ప్రమాదకరమైన వ్యాధులకు మందులు తయారు చేయడంలో వీటిని ఉపయోగిస్తుండటం వల్ల వీటి డిమాండ్ భారీ గా ఉంటుంటుంది. అయితే... ఈ జాతి కీటకాలు త్వరలో అంతరించిపోయే ప్రమాదంలో ఉందని అంటున్నారు. ఇటీవల జపాన్ కి చెందిన వ్యక్తి వీటిని పెంచి అమ్ముతున్నారు! ఏది ఏమైనా... ఈ స్థాయిలో భారీ ధర పలుకుతుండటంతో ఈ కీటకానికి సంబందించిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News