495 విమానాలు.. 145 దేశాలు.. అమెరికా కీలక వ్యాఖ్యలు!
అగ్రరాజ్యం అమెరికాకు ఉన్న అతిపెద్ద సమస్యల్లో అక్రమ వలసలు అనేది ఒకటనే సంగతి తెలిసిందే.
అగ్రరాజ్యం అమెరికాకు ఉన్న అతిపెద్ద సమస్యల్లో అక్రమ వలసలు అనేది ఒకటనే సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష అభ్యర్థుల ప్రచార కార్యక్రమాల్లోనూ, ఎన్నికల హామీల్లోనూ ఈ విషయం హైలెట్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన డీ.హెచ్.ఎస్. కీలక నిర్ణయం అమలుచేసింది.
అవును... అమెరికాకు ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా ఉన్న అక్రమ వలసల విషయంలో యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ (డీ.హెచ్.ఎస్.) ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయులను అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపినట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా స్పందించిన డీ.హెచ్.ఎస్. సీనియర్ అధికారి క్రిస్టీ ఎ. కనెగాల్లో.. చట్టబద్ధత లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయ పౌరులను వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నామని.. వలస వచ్చిన ప్రజలు స్మగ్లర్ల చెతిలో బందీలు కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ చర్యలకు ఉపక్రమించామని.. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ చర్యలు చేపట్టామని తెలిపారు.
ఈ విధంగా అమెరికా నైరుతి సరిహద్దుల్లో అనధికారిక వలసలు 55 శాతం తగ్గినట్లు డీ.హెచ్.ఎస్. గుర్తించింది. ఈ క్రమంలోనే 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో 495కు పైగా ప్రత్యేక విమానాల్లో.. 145 దేశాలకు చెందిన.. ఒక లక్ష 60 వేల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపినట్లు తెలిపింది.
వీరిలో భారత్ తో పాటు చైనా, ఈక్వెడార్, ఈజిప్ట్, కొలంబియా, పెరూ, సెనెగల్, మారిటానియా, ఉజ్బెకిస్తాన్ దేశాల పరులు ఉన్నట్లు వెల్లడించింది.